Sreeleela: టాలీవుడ్ హీరోయిన్ ముద్దుగుమ్మ శ్రీ లీలా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో హీరోయిన్ శ్రీలీల పేరు కూడా ఒకటి. ప్రస్తుతం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఎంబిబిఎస్ కోర్సు చేస్తోంది.
రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన శ్రీలీల. తొలి సినిమాతోనే కుర్రకారు గుండెలను కొల్లగొట్టేసింది. అందం, అభినయంతో పాటు తన ఎనర్జీతో ప్రేక్షకులను కవ్వించింది. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో శ్రీలీల పేరు మారు మ్రోగింది. ఈ అమ్మడికి బ్యాక్ టు బ్యాక్ సినిమా ఛాన్స్ లు వచ్చాయి. దాంతో వరుసగా సినిమాలు చేసింది శ్రీలీల. యంగ్ హీరోలందరికీ సరసన ఛాన్స్ అందుకుంది ఈ క్రేజీ బ్యూటీ. ధమాకా సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన భగవంత్ కేసరి సినిమాలో నటించింది.
విజయ్ సినిమా నుంచి శ్రీలీల అవుట్..
ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ వెంటనే శ్రీలీల వరుస సినిమాలతో దూసుకుపోయింది. స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఉంటే ఇప్పుడు శ్రీలీల ఓ క్రేజీ ప్రోజెక్ట్ నుంచి తప్పుకుందని తెలుస్తోంది. శ్రీలీల విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ నటిస్తున్న 12వ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు శ్రీ లీల ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుందని తెలుస్తోంది. ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ ను ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాల గురించి తెలియాలి అంటే మూవీ మేకర్ స్పందించేంతవరకు వేచి చూడాల్సిందే మరి. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ పిక్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…