Virupaksha Movie: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా తాజాగా విడుదలై మొదటి షో నుండి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా మరొకవైపు మరోవైపు సినీ విశ్లేషకులు సైతం ఈ మూవీపై పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు.
ఈ సినిమా సక్సెస్ అవటంతో సెలబ్రిటీలు కూడా సాయిధరమ్ తేజ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా విరూపాక్ష టీం కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో..” విరూపాక్ష సినిమాకు వస్తున్న మంచి రిపోర్ట్స్ వింటున్నాను. నీ పట్ల చాలా సంతోషంగా ఉంది తేజ్.. ఒక బ్యాంగ్ తో నువ్వు మళ్లీ తిరిగి కంబ్యాక్ వచ్చావు. ప్రేక్షకులు నిన్ను అప్రిషియేట్ చేస్తూ వారి బ్లెస్సింగ్ తెలియజేస్తున్నారు. సినిమా సక్సెస్ కి టీం అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
తాజాగా చిరంజీవి చేసిన ట్వీట్ కి సాయి ధరమ్ తేజ్ కూడా రిప్లై ఇచ్చాడు. ఈ క్రమంలో ‘ థాంక్యూ మామా అత్తా ‘ అంటూ రిప్లై ఇచ్చి ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉండగా మరొకవైపు మెగా అభిమానులు కూడా విరూపాక్ష సినిమా సక్సెస్ అవ్వటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Virupaksha Movie: సాయి ధరమ్ తేజ్ కి ఇది పునర్జన్మ…
ప్రమాదం జరగడం వల్ల రెండేళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సాయి ధరమ్ తేజ్ అనారోగ్యం నుండి కోలుకొని ఇలా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇది సాయి ధరమ్ తేజ్ కి పునర్జన్మ అని చెప్పవచ్చు. విరూపాక్ష సినిమాతో సాయిధరమ్ తేజ్ తన సినీ కెరీర్ ని మరొకసారి ప్రారంభించాడు. మొదటి ప్రయత్నంలోనే విరూపాక్ష సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్నాడు. ఇకపై కూడా సాయి ధరమ్ తేజ్ ఇలాంటి విజయాలు అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…