Movie News

Meena Daughter: అమ్మ గురించి తప్పుడు వార్తలు రాయొద్దు… తను కూడా మనిషే కదా: నైనిక

Meena Daughter: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మీనా గత 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది. బాలనటిగా ప్రేక్షకులను అలరించిన మీనా ఆ తర్వాత హీరోయిన్ గా మారి తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది.

ఆ తర్వాత వివాహం చేసుకొని కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న మీనా మళ్లీ భర్త సహకారంతో ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చి తల్లి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా మీనా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల చెన్నైలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోలీవుడ్ సెలబ్రిటీలు హాజరై మీనాకి సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరయ్యాడు.

ఇక ఈ కార్యక్రమంలో మీనా కూతురు నైనిక తన తల్లి గురించి మాట్లాడిన మాటలకు రజనీకాంత్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తండ్రి మరణించిన తర్వాత తన తల్లి మానసిక ఒత్తిడికి గురైందని.. అదొక పెయిన్ ఫుల్ టైమ్ అంటూ నైనిక ఎమోషనల్ అయ్యింది. ఈ వీడియోలో నైనిక మాట్లాడుతూ…” అమ్మా.. నటిగా నువ్వు ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చినందుకు నేను గర్విస్తున్నాను. నటిగా మాత్రమే కాకుండా ఒక తల్లిగా కూడా నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు.నాన్న మరణంతో పరిస్థితులు చీకటిగా మారాయి.

Meena Daughter: తనకు ఫీలింగ్స్ ఉంటాయి…

ఇకపై నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటూ అన్ని విషయాల్లో సాయం చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే కొద్దిరోజులుగా మా అమ్మ గురించి కొన్ని తప్పుడు వార్తలు వచ్చాయని, అమ్మ కేవలం నటి మాత్రమే కాదు.. మీలాగా ఓ మనిషే.. ఆమెకూ ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వార్తలు రాయొద్దు అంటూ ఎమోషనల్ అయ్యింది. దీంతో అక్కడే ఉన్న రజినీతోపాటు.. ఇతర సెలబ్రెటీలు కన్నీళ్లు పెట్టుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

30 తర్వాత కండరాలు క్షీణిస్తున్నాయా? నడవడంలో ఇబ్బంది? ఇది సార్కోపీనియా సంకేతమా?

వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…

20 minutes ago

ఒకసారి వాడిన నూనె మళ్లీ వాడుతున్నారా? ఇది తప్పక తెలుసుకోండి!

మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…

50 minutes ago

అలసట, బలహీనతకు కారణం ఇదే.. చిన్నారుల ఆరోగ్యానికి కీలకం.. ఎనీమియా నివారణకు సరైన డైట్!

మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…

1 hour ago

ఈ రోజు రాశి ఫలాలు.. వృశ్చిక రాశికి శుభసూచనలు, మిగతావారికి హెచ్చరికలు!

2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…

2 hours ago

శని బాధలకు ఉపశమనం.. గుజరాత్‌లోని ఈ హనుమ ఆలయం ఎందుకు ప్రత్యేకం?

గుజరాత్‌లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…

2 hours ago

విదేశీ ఉద్యోగం అంటూ వల.. యువత మోసపోయిన కథ

విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…

12 hours ago