Chiranjeevi: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సెలబ్రిటీలందరూ కూడా క్యూ లైన్లో నిలబడి మరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా సినీ సెలబ్రిటీలు అందరూ కూడా వచ్చే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా నేడు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా ఓటు వినియోగించుకున్నటువంటి చిరంజీవి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ యువతకు మంచి సందేశం అందజేశారు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాయుద్ధం అయినటువంటి ఓటును యువత అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోనూ అలాగే కేంద్రంలో కూడా సరైన ప్రభుత్వాలు అధికారంలోకి వస్తేనే ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నారు.
ఓటు మన బాధ్యత..
ఇక చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ కూడా ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీక్లబ్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు వీరితోపాటు ఎన్టీఆర్ అల్లు అర్జున్ శ్రీకాంత్ దంపతులు కూడా ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…