Meka Ramakrishna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సీరియల్స్ లో తనదైన శైలిలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మేక రామకృష్ణ గురించి అందరికీ తెలిసిందే.ఈయన పేరు చెబితే బహుశా గుర్తు పట్టకపోవచ్చు. కానీ ఇతనిని చూస్తే మాత్రం అందరికీ ఎంతో సుపరిచితమైన వ్యక్తి అని మాత్రం తెలుస్తుంది.ఇలా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన మేక రామకృష్ణ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని ప్రొడక్షన్ హౌస్ లో చిన్న ఆర్టిస్టులకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి వెల్లడించారు.
సాధారణంగా ప్రొడక్షన్ హౌస్లో మన క్యాటగిరిని బట్టి మనకు విలువ ఇస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అడుక్కునే వాళ్లకి కూడా మనం మర్యాదగా వాళ్లకి కావాల్సిన వస్తువులను చేతితో ఇస్తాం కానీ ఇండస్ట్రీలో మాత్రం ఆర్టిస్టులను అంత కన్నా దారుణంగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు ప్రొడక్షన్ బాయ్స్ చేష్టలకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి.
ఇండస్ట్రీలో సాధారణంగా కేటగిరీలను బట్టి వారికి ఫుడ్ అందిస్తూ వుంటారు. పొరపాటున కేటగిరికి కాకుండా వేరే క్యాటగిరి దగ్గరకు వెళ్తే అక్కడ ప్రొడక్షన్ బాయ్స్ ఎంతో నీచంగా మాట్లాడతారని… ఎన్నోసార్లు వారిని తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయనీ తెలిపారు.అయితే ప్రొడక్షన్ బాయ్స్ చేసే ఈ పనులన్నీ దర్శక నిర్మాతలకు తెలియవుపొరపాటున ప్రొడక్షన్ బాయ్స్ ని తిడితే వారికి కాఫీలో మోషన్ టాబ్లెట్ కల్పించడం. టాయిలెట్ లో నీళ్లు తీసుకొచ్చి ఇవ్వడం వంటివి చేస్తుంటారు.
నీకు అంత రేంజ్ లేదన్నారు..
అయితే ప్రొడక్షన్ హౌస్ లో అందరూ అలాగే ఉంటారా అంటే ఉండరని కొందరు గురించి మాత్రమే తాను మాట్లాడుతున్నానని తెలిపారు.ఒక సమయంలో సెట్లో ఎనిమిది మందితో కలిసి కూర్చొని భోజనం చేస్తుండగా ప్రొడక్షన్ బాయ్స్ మిగిలిన ఏడుగురికి వేడి అన్నం పెట్టి నాకు మాత్రం బయట నుంచి తెప్పించిన భోజనం పెట్టారు. అదే నాకు కూడా అదే పెట్టొచ్చు కదా అని అడిగితే నీకు అంత రేంజ్ లేదని చెప్పారు. ఇలా అందరి ముందు అనడంతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయని ఆ అవమానంతో చచ్చిపోవాలనుకున్నానని ఈ సందర్భంగా మేక రామకృష్ణ ఇండస్ట్రీలో చిన్న ఆర్టిస్టుల బతుకులు ఏ విధంగా ఉంటాయో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…