రెండు వేల రూపాయిల నోటు మీద కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసారు. గత కొద్దీ రోజులుగా రెండు వేల రూపాయిల నోటును రద్దు చేస్తారు అనే వార్త పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో దీనిపై భారీగానే పోస్టులు పెట్టారు. దీనితో ప్రజలు గందరగోళానికి గురయిన సందర్భాలు చాలా ఉన్నాయి. 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం డెమోనిటైజేషన్ చేసినట్టుగా మళ్ళి రెండు వేల రూపాయిల నోట్లు రద్దు చేస్తారేమోనని ప్రజలు ఆందోనళ చెందారు. అయితే దీనిపై ఇప్పుడు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. రెండు వేల రూపాయిల నోటుపై దుష్ప్రచారం చేస్తున్నారని.. కేంద్రం రెండు వేల రూపాయిల నోట్లను రద్దు చేస్తారనే వార్తను కొట్టి పారేసారు ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్. అటువంటి ప్రతిపాదన ఏమీ కేంద్రం వద్ద లేదని స్పష్టం చేసారు కేంద్ర మంత్రి.
గత కొంత కాలంగా రెండు వేల రూపాయిల నోటు రద్దుపై పెద్ద చర్చే జరిగింది. ప్రధానంగా బ్యాంకులు తీసుకోవడమే గాని ఇచ్చేది లేదని ప్రచారం జోరుగా జరిగింది. దీనితో కొన్ని చోట్ల ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల రూపాయిల నోట్లను వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలతో రెండు వేల రూపాయిల నోట్లకు వచ్చిన ముప్పేమీ లేదని తేలింది. దీనితో ప్రజలు, వ్యాపారాలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…