Minister RK Roja : సినిమాల్లో హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అగ్ర హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో కొన్నేళ్లు టాప్ లో ఉన్న రోజా అన్ని భాషల్లోనూ హీరోయిన్ గా నటించింది. ఇక పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన రోజా అటు బుల్లితెర మీదా అదరగొట్టింది. మోడరన్ మహలక్ష్మి తో మొదలు పెట్టి జబర్దస్త్ తో మరోసారి మంచి ఫామ్లోకి వచ్చింది. అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఇటు జబర్దస్త్ షో చేస్తూ ఉండే రోజా పాలిటిక్స్ లో మొదట టీడీపీ తో మొదలు పెట్టి ఆ తరువాత వైసీపీ లోకి వెళ్లి ప్రస్తుతం నగరి ఎమ్మెల్యే గా ఉంటూ అలానే మంత్రిగా జగన్ కేబినెట్ లో కొనసాగుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఒక ఉరినే దత్తత తీసుకున్నారు, అలానే ఆర్థికంగా ఇబ్బందులుండి తల్లి దండ్రులు లేక చదువుకోలేని వాళ్లకు చదువు అందిస్తూ ప్రజా సేవ చేస్తున్నారు రోజా.
ఆ సినిమా విషయంలో నష్టపోయాను…
ఆర్కే రోజా ఎపుడూ రాజకీయాల గురించి లేదంటే సినిమా కెరీర్ గురించి ఇంటర్వ్యూలలో చెబుతుంటారు. అయితే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాత్రం తన వ్యక్తిగత జీవితం అది కూడా తన ప్రేమ, పెళ్లి గురించిన విషయాలను పంచుకున్నారు. అందరికీ తెలిసిన విషయమే ఆర్కే రోజా తమిళ డైరెక్టర్ సెల్వమణి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరి పెళ్లి అంత సులువుగా అవ్వలేదు, ఎన్నో ఇబ్బందల తరువాత వాళ్ళు పెళ్లి చేసుకొని ఒక్కటైయ్యారు. తమిళంలో ‘చంబరతి’ అనే సినిమాలో మొదటగా రోజా నటించారు.
ఆ సినిమా డైరెక్టర్ సెల్వమణి కావడం, ఆప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 1991 నాటికి అగ్ర హీరోయిన్ గా ఉన్న రోజా మిగిలిన హీరోయిన్స్ లాగా తాను కూడా సెటిల్ అవ్వకుండా సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టింది. అలా తన సోదరులతో కలిసి ‘సమరం’ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూ సెల్వమణి గారి డైరెక్షన్ లో హీరోయిన్ గా అందులో చేసింది. అయితే ఆ సినిమాకు ఉన్నదంతా పెట్టడం, సినిమా విడుదల అయ్యాక నష్టాలను మిగల్చడంతో ఆ సినిమా విడుదల అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకున్న రోజా ఆ నిర్ణయంను వాయిదా వేసుకుంది. మళ్ళీ అప్పులను తీర్చే వరకు పెళ్లి గురించి ఆలోచించకుండా మళ్ళీ డబ్బు సంపాదించి అప్పులను తీర్చి కుటుంబాన్ని మళ్ళీ నిలబెట్టి అపుడు 2002 లో ప్రేమించిన డైరెక్టర్ సెల్వమణి ని పెళ్లాడింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…