Supritha: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు ప్రేమలో పడటం అలాగే చాలా తొందరగా తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకొని విడిపోవడం జరుగుతుంటుంది. ఇలా ప్రేమ పెళ్లిళ్లు బ్రేకప్ లు ఇండస్ట్రీలో సర్వసాధారణం. ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటి సురేఖ వాణి ఒకప్పుడు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండేవారు. ప్రస్తుతం ఈమె సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు.
తానేమీ సినీమాలకు దూరం కాలేదని అవకాశాలు రాకపోవడంతోనే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానంటూ సురేఖ వాణి ఓ సందర్భంలో తెలియచేశారు. ఇక ఈమె సినిమాలకన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇలా సోషల్ మీడియాలో తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి పొట్టి దుస్తుల ధరిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు.
ఇకపోతే తాజాగా సుప్రీత గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది సుప్రీత ప్రముఖ యూట్యూబ్ యాంకర్ నిఖిల్ విజయసింహతో ప్రేమలో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా వీరిద్దరూ జీ తెలుగులో వాలెంటైన్స్ డే సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఒక స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా వీరిద్దరూ జంటగా సందడి చేశారు.
ఇలా ప్రేమికుల దినోత్సవం రోజు వీరిద్దరూ జంటగా పాల్గొనడంతో సురేఖవాణి కుమార్తె సుప్రీత నిఖిల్ విజయసింహతో ప్రేమలో ఉందా అంటూ పెద్ద ఎత్తున అభిమానులు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. మరి సుప్రీత నిజంగానే నిఖిల్ విజయ్ సింహతో ప్రేమలో ఉందా లేకపోతే ఈవెంట్ కోసమే తనతో కలిసి జతకట్టారా అనే విషయం తెలియాల్సి ఉంది.ఇక సుప్రీత ఇప్పటివరకు సినిమాలలోకి రాకపోయినా ఈమెకు హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.త్వరలోనే లేచింది మహిళలోకం అనే సినిమాలో ఈమె కూడా ఓ పాత్రలో నటిస్తూ వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…