Tarakaratna Health Update : నందమూరి తారకరత్న కుప్పంలో జరిగిన నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వెళ్లి అక్కడ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలిండం చకచకా జరిగిపోయాయి. తారకరత్న గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో 45 నిమిషాల పాటు శ్రమించి మళ్ళీ గుండె కొట్టుకునేలా కుప్పం వైధ్యులు శ్రమించరు. ఇక అక్కడి నుండి బెంగళూరు నారాయణ హృదయాలయకు తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అక్కడ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించారు. కోలుకుంటున్నాడు, తిరిగివస్తాడు అంటూ పరామర్శించిన అందరూ చెప్పారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చెబుతున్నా ఇంకా పరిస్థితి క్రిటికల్ గా ఉందంటూ తెలుస్తోంది.
ఎక్కడున్నాడు.. ఎందుకు అప్డేట్స్ రావడం లేదు…
తారకరత్న విషయంలో మొదటి వారం రోజులు బాగా హడావిడి కనిపించింది. మెయిన్ స్ట్రీమ్ తో పాటు యూట్యూబ్ ఛానెల్స్ కూడా తారకరత్న హెల్త్ అప్డేట్స్ గురించి చెప్పేవారు. అయితే ఒక వారం రోజులుగా తారకరత్న హెల్త్ కండిషన్స్ గురించి ఏ న్యూస్ బయటికి రావడం లేదు. కుటుంబ సభ్యులైన బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటివారు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయ్యారు. అసలు ఏం జరుగుతోంది. తారకరత్న కోలుకున్నాడా, అపాయం నుండి గట్టెక్కినట్టేనా అనే విషయాల్లో క్లారిటీ లేదు.
తాజాగా తారకరత్న బ్రెయిన్ కి డామేజ్ ఉందంటూ కథనాలు వస్తున్నా అందులో నిజమెంతో ఎవరికీ తెలియదు. హెల్త్ బులిటెన్ విడుదల చేసి ఆయన పూర్తిగా కోలుకున్నట్లేనా లేక బ్రెయిన్ డామేజ్ జరిగడం వల్ల భవిష్యత్ లో ఇబ్బందులు ఉంటాయా లాంటి విషయాలను వైద్యులు చెప్పాల్సి ఉంది. ఇప్పటికైతే ఇంకా వెంటిలేటర్ చికిత్సలో తారకరత్న బెంగళూరులోనే చికిత్సలో ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…