Movie News

Actor Sunil: సుకుమార్ తో ఉన్నచనువుతో అవకాశం ఇవ్వమని అడిగా… ఆయన అలా అంటారని ఊహించలేదు: సునీల్

Actor Sunil: తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో సునీల్ ఒకరు ఈయన కెరియర్ మొదట్లో కమెడియన్ ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇలా కమెడియన్ గా బిజీగా ఉన్న సమయంలోనే ఈయనకు హీరోగా అవకాశం వచ్చింది. ఇలా హీరోగా పలు సినిమాలలో నటించారు అయితే హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.

ఇలా హీరోగా అవకాశాలు రావడం తగ్గిపోవడంతో తిరిగి ఈయన కమెడియన్ గా సహాయ నటుడిగా సినిమాలలో నటించారు.అలాగే విలన్ పాత్రలలో కూడా నటించారు. ప్రస్తుతం ఈయన వరుసగా విలన్ పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సునీల్ పుష్ప సినిమాలోని మంగళం శీను పాత్ర గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమాలో సునీల్ మంగళం శీను అనే విలన్ పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటనకు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా అనంతరం సునీల్ కు విలన్ గా నటించడానికి ఎక్కువగా అవకాశాలు రావడం విశేషం. అయితే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మంగళం శీను పాత్ర గురించి సునీల్ పలు విషయాలు తెలియజేశారు.

Actor Sunil: ఏదైనా కొత్తగా ట్రై చేయాలి…


తనకు సుకుమార్ తో ఉన్నటువంటి మంచి అనుబంధం కారణంగా ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి అని అడిగాను. అలా అడగడంతో వెంటనే సుకుమార్ ఇప్పటికే నీ బాడీలో ఉన్న అన్ని యాంగిల్స్ చూపించావు అని అనేశారు. నీకు అవకాశం ఇవ్వాలంటే కొత్తగా ట్రై చేయాలని చెప్పారు. ఇక ఆ సమయంలో కరోనా ఉండడంతో ఆయన మంగళం శీను పాత్రను డిజైన్ చేసి స్కెచ్ పంపించారు. అందుకు అనుగుణంగా నేను తయారై ఫోటో టెస్ట్ చేసి పంపించాను. చివరికి ఆ పాత్రకు తనని ఓకే చేశారని ఈ సందర్భంగా సునీల్ మంగళం శీను పాత్ర గురించి తెలుపుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago