Mirchi Madhavi : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ గుర్తింపుతో దూసుకుపోతున్న నటి ఊట్ల మాధవి. కానీ మిర్చి మాధవి గా సినిమాల్లో బాగా గుర్తింపు తెచ్చుకుంది. మొదట రేడియో జాకీగా తన కెరీర్ మొదలు పెట్టిన మాధవి ఆ తరువాత ఆర్టిస్ట్ గా సినిమాల్లో ప్రయాణాన్ని మొదలు పెట్టారు. చాలా సినిమాల్లో అత్త, వదిన, తల్లి పాత్రలతో మెప్పించిన మాధవి ఎన్టీఆర్ కథానాయకుడు, రామ చక్కని సీత, జోడి, శతమానం భవతి వంటి సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. ఇక సినిమాలే కాకుండా సీరియల్ ఆర్టిస్ట్ గా ఉన్న మిర్చి మాధవి మా టీవిలో ప్రసారమయ్యే ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో నటిస్తోంది.
సీరియల్ విషయంలో జరిగింది ఇదే…
గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్న మిర్చి మాధవి గారు ఆ సీరియల్ 500 ఎపిసోడ్ సెలెబ్రేషన్స్ లో కనిపించలేదు. సీరియల్ యూనిట్ అంతా సెలెబ్రేట్ చేసుకున్నా అందులో కీలక విలన్ పాత్ర పోషిస్తున్న మాధవి కనిపించకపోవడం గురించి మాధవి మాట్లాడుతూ సీరియల్ నాలుగు రోజులు కాలేజీలో షూటింగ్ జరిగితే మూడు రోజులు ఇంట్లో జరుగుతుంది. నేను నటించే సీన్స్ మొత్తం ఇంట్లోనే ఉంటాయి కనుక ఇంట్లో షూటింగ్ లో నేనుంటాను. కాలేజీలో జరిగే షూటింగ్ సమయంలో 500 ఎపిసోడ్ జరగడం వల్ల అక్కడే సెలెబ్రేషన్స్ చేసారు. అందుకే నేను పాల్గొనలేదు అంటూ మాధవి వివరించారు.
నమ్మిన వాళ్లే మోసం చేసారు…
మనం ఎంత చురుగ్గా అలర్ట్ గా ఉన్నా కూడా కొన్నిసార్లు ఎదుటి వాళ్లను నమ్మి మోసపోతాము. నాకు స్టాక్స్ గురించి అంత అవగాహన లేకపోతే ఇంట్లో వాళ్లే కదా అనే నమ్మకంతో తెలిసిన వ్యక్తికి స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఐదు లక్షలు సర్దుబాటు చేసి ఇచ్చాను కానీ మోసపోయాను. నా డబ్బు పోవడం కంటే తెలిసిన వాళ్ళే ఇలా చేశారే అనిపించింది. ఇక ఇప్పటికి లక్ష రికవర్ అయింది మిగిలినది చేసుకోవాలి అంటూ చెప్పారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…