General News

దక్షిణాప్రికా నుంచి వచ్చిన 10 మంది ప్రయాణికులు మిస్సింగ్.. ఆందోళనలో కర్ణాటక ప్రజలు

కర్ణాటకలోని బెంగళూరులో దక్షిణాఫ్రికాకు చెందిన పది మంది విదేశీయులు అదృశ్యమైనట్లు ఆరోపణలు వచ్చాయి. బెంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ , నగర ఆరోగ్య శాఖ అధికారులు తాము వాళ్ల జాడను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.భారతదేశంలో ఓమిక్రాన్ యొక్క మొదటి కేసు బెంగళూరులోనే కొనుగొనబడింది.

ఆ వ్యక్తి కూడా దక్షిణాప్రికా నుంచి వచ్చాడు. ఇలా 10 మంది దక్షిణాప్రికా నుంచి వచ్చిన వ్యక్తలు కనపడకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక హెల్త్‌ మినిస్టర్‌ మాట్లాడుతూ.. ‘‘దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వెలుగు చూసిన తర్వాత అక్కడ నుంచి 57 మంది బెంగళూరుకి వచ్చారు.

వీరిలో 10 మంది ఆచూకీ లభించడం లేదు. బీబీఎంపీ వారిని వెతికే పనిలో ఉందన్నారు. సదరు ప్రయాణికులు ఫోన్‌ నంబర్లు స్విచ్ఛాఫ్‌ వస్తున్నాయని తెలిపారు. వారు ఇచ్చిన అడ్రెస్‌కు వెళ్లి చూడగా.. అక్కడ ఎవరూ లేరు. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు. ఇక ఇప్పటికే కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని.. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పిపోయిన వారి కోసం గాలిస్తున్నామని .. వాళ్లను త్వరలోనే పట్టుకుంటామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

5 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

5 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

7 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

7 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

8 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

8 hours ago