General News

దారుణం.. తొమ్మిది నెలల కుమార్తెతో పాటు తల్లి కూడా..

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులు భరించలేక కన్న కూతురితో పాటు ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఇలా తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో గురువారం తెల్లవారుజామున ఓ మహిళ కూతురిని నడుముకు కట్టేసి వాటర్ ట్యాంక్‌లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన చోటుచేసుకుంది .

తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన సరిత(20)కు రెండేళ్ల క్రితం మేనబావ ఎత్తరి శ్రీశైలం(25)కు ఇచ్చి పెళ్లి చేశారు. వారికి ప్రస్తుతం తొమ్మిది నెలల కుమార్తె ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. అతనపు కట్నం కావాలని ప్రతీ రోజు అత్తామామలు వేధించడం మొదలు పెట్టారు. ఈ విషయం తన భర్తకు చెప్పినా పట్టించుకోకపోవడతో పాటు తల్లికే అతడు సపోర్ట్ చేశాడు.

దీంతో ఈ కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఆమె రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు రావడంతో కుటుంబ సభ్యులు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. తెలిసిన వాళ్ల దగ్గర వెతికారు. బంధువుల ఇళ్లకు ఫోన్ చేసి ఆచూకీ అడిగారు. కానీ ఎక్కడా ఆమె కనిపించలేదు. చేసేది లేక వాళ్లు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వాళ్లకు జరిగిన విషయం చెప్పారు.

వారు అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా, గురువారం ఉదయం ఆ ఊరి సమీపంలోనే వాటర్ ట్యాంక్‌లో తల్లీ కూతుళ్లు మృతదేహాలను ఆ గ్రామ ప్రజలు చూశారు. వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago