కర్ణాటకలోని బెంగళూరులో దక్షిణాఫ్రికాకు చెందిన పది మంది విదేశీయులు అదృశ్యమైనట్లు ఆరోపణలు వచ్చాయి. బెంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ , నగర ఆరోగ్య శాఖ అధికారులు తాము వాళ్ల జాడను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.భారతదేశంలో ఓమిక్రాన్ యొక్క మొదటి కేసు బెంగళూరులోనే కొనుగొనబడింది.
ఆ వ్యక్తి కూడా దక్షిణాప్రికా నుంచి వచ్చాడు. ఇలా 10 మంది దక్షిణాప్రికా నుంచి వచ్చిన వ్యక్తలు కనపడకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక హెల్త్ మినిస్టర్ మాట్లాడుతూ.. ‘‘దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వెలుగు చూసిన తర్వాత అక్కడ నుంచి 57 మంది బెంగళూరుకి వచ్చారు.
వీరిలో 10 మంది ఆచూకీ లభించడం లేదు. బీబీఎంపీ వారిని వెతికే పనిలో ఉందన్నారు. సదరు ప్రయాణికులు ఫోన్ నంబర్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయని తెలిపారు. వారు ఇచ్చిన అడ్రెస్‌కు వెళ్లి చూడగా.. అక్కడ ఎవరూ లేరు. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు. ఇక ఇప్పటికే కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని.. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పిపోయిన వారి కోసం గాలిస్తున్నామని .. వాళ్లను త్వరలోనే పట్టుకుంటామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…