Actress Siva Parvathi : టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా, హీరోగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన క్రమశిక్షణకు మారుపేరు అని అందరికీ తెలిసిందే. ఇక షూటింగ్ లొకేషన్లో ఎవరైనా ఏ మాత్రం క్రమశిక్షణ పాటించకపోతే వారిని చెడామడా తిట్టేస్తారు.ఈ క్రమంలోనే నటి శివపార్వతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మోహన్ బాబు గురించి ఒక సంఘటనను తెలియజేశారు.
లక్ష్మి ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్లో రౌడీ గారి పెళ్ళాం సినిమా చేస్తున్న సమయంలో తాను ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని తెలిపారు.ఈ సినిమా ద్వారానే తాను లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్ బ్యానర్ లో మొట్టమొదటి సారిగా నటించానని తెలిపారు. ఇక ఈ సినిమాలో నేను చాలా చిన్న క్యారెక్టర్ లో నటించాను. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా శోభన నటించారని శివపార్వతి తెలిపారు. ఇక షూటింగ్ లొకేషన్ లో ఒక రోజు శోభన నాకు విష్ చేయకుండా వెళ్లిపోయారు.
ఈ విషయం గమనించిన మోహన్ బాబు శోభనను నా దగ్గరకు పిలిచి ఆవిడ ఎవరు అనుకుంటున్నావు ఆమె ఎక్స్లెంట్ ఆర్టిస్ట్ తనకి ఎందుకు విష్ చేయలేదు అని తన ఎదురుగానే శోభనను తిట్టారని ఈ సందర్భంగా శివ పార్వతి వెల్లడించారు. ఇలా ఆయన ఎందుకు చెబుతున్నారు అని అనుకున్నాను.ఇది తప్పు అంటూ ఆ రోజు మోహన్ బాబు శోభనను తిట్టారు. ఇక మోహన్ బాబు దృష్టిలో ఒకసారి ఆర్టిస్ట్ అని ఆలోచన వచ్చిందంటే వాళ్ళు చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్ట్ అనే తేడాలు అతనికి ఉండవని తెలిపారు.
ఇకపోతే మోహన్ బాబు క్రమశిక్షణ లేకపోతే ప్రతి ఒక్కరిని గట్టిగా అరుస్తారని అయితే ఇలా అరిచే వాళ్లే ఇండస్ట్రీకి కావాలని ఈమె తెలిపారు.ఒకప్పుడు ప్రతి ఒక్కరూ సరైన సమయానికి షూటింగ్ లొకేషన్ కి చేరుకొని సినిమాలలో నటించే వారు. అయితే ప్రస్తుతం ఉదయం 10 గంటలైనా అయినా ఒక షార్ట్ కూడా పూర్తి కావడంలేదని ప్రస్తుతం మన ఆర్టిస్టులలో సమయ పాలన లేదని, ఇలా క్రమశిక్షణలో పెట్టేవారు ఇండస్ట్రీకి అవసరం అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
పౌరాణిక కథలపై తెరకెక్కుతున్న భారీ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న…
టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడిక్ చిత్రాల్లో ఒకటైన రణబాలి షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన…
టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి మృణాల్ ఠాకూర్ ప్రేమపై తన అభిప్రాయాలను తాజాగా వెల్లడించారు. జీవితంలో…
టాలీవుడ్ నటుడు అడివి శేష్ తన జీవితంలో చోటుచేసుకున్న ఓ ప్రత్యేకమైన ప్రేమ కథను తాజాగా అభిమానులతో పంచుకున్నారు. యవ్వనంలో…
టాలీవుడ్‌లో కొత్తగా అడుగుపెట్టిన హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి రిద్ధి కుమార్. సహజమైన అందం, సింపుల్…
భారతదేశంలో దేవాలయాలకు వెళ్లినప్పుడు లడ్డూ, పులిహోర, పండ్లు వంటి సంప్రదాయ ప్రసాదాలు అందుకోవడం సాధారణం. కానీ పశ్చిమ బెంగాల్ రాజధాని…