దేవుడు ఉన్నాడా.. లేడా.. ? దీనిపై పూరీ జగన్నాథ్ ఇలా చెప్పాడు..

కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు.. కొంతమంది దేవుడు లేడని నమ్ముతారు. దేవుడు లేడని వాధించేవారిని నాస్థికుడు అంటారు. అతడు కేవలం ప్రకృతి మాత్రమే అన్ని ప్రసాదిస్తుంది. దేవుడు అస్సలు ఈ సమస్థ భూగోళంలో లేడని.. అది కేవలం కట్టుకథలుగా చెప్పే గూడు పుఠాని అంటూ చెబుతాడు నాస్థికుడు. అయితే టాలీవుడ్ డైనమిక్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దీనిపై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మొహమాటం లేకుండా ముక్కు సూటిగా మాట్లాడే పూరీ.. తన మనసులో ఏముందో బయటకు కూడా అదే అనేస్తుంటారు. ఇతడు కూడా నాస్తికుడిగా గుర్తింపు పొందాడు.

అతడు దేవుడిపై నిత్యం ఏదో ఒక అంశం మాట్లాడుతూ.. వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఈ టాపిక్ పై మరోసారి స్పందించాడు. దేవుడు ఉన్నాడా.. లేడా అంటూ ఓ వీడియోను వదిలాడు. దేవుడు ఉన్నాడా.. లేడా అనే ప్రశ్నకు ఎక్కువ సమాధానం అవసరం లేదు.. ఒక్క ముక్కలో చెప్పేయాలి.. అని ఒక వ్యక్తి జిడ్డు కృష్ణమూర్తిని ఒకరోజు నిలదీసి అడిగారు. దానికి కృష్ణమూర్తి దానికి సున్నితంగా సమాధానం చెప్పారు. కానీ ప్రశ్న అడిగిన వ్యక్తికి అర్థం కాలేదు. ఇది చెబుతూ తన ప్రసంగాన్ని ఇలా మొదలు పెట్టాడు.. ఈ ప్రశ్నకు సమాధానం జిడ్డు కృష్ణమూర్తి చెప్పినట్లుగా సున్నితంగా చెబితే కుదరదు.. కొంచెం అర్థం అయ్యేలా చెప్పాలంటూ అతడు ఇలా చెప్పుకొచ్చాడు. ఇక్కడ రెండు ప్రశ్నలు అవేంటంటే.. దేవుడు మనిషిని తయారు చేశాడా.. ? లేదా మనిషి దేవుడిని తయారు చేశాడా..? అని ప్రశ్నించుకుంటూ అతడే రెండింటికి సమాధానాలు చెప్పాడు.

దేవుడు మనుషులను తయారు చేస్తే… మనుషులు తయారు చేసిన ఐ ఫోన్ , టెస్లా కారు అద్బుతాలు అయితే దేవుడు తయారు చేసిన మనం ఇంకెంత అద్బుతంగా ఉండాలి.. అసలు మనం అలా ఉన్నామా.. లేదు కదా అని అన్నాడు. మనం దేవుడి పిల్లలమని అందరూ అంటారు.. అది నిజమైతే.. ఎందుకు కరుణ, జాలి, దయ అనేవి ఉండవు.. దేవుడు ఎలా ఉంటాడో మనం కూడా అలానే ఉండాలి కదా.. అలా ఎందుకు లేము మరి అంటూ చెప్పాడు.

మనిషే దేవుడిని తయారు చేస్తే.. దేవుడిని ఐనస్టీన్, న్యూటన్ లాంటి వారు తయారుచేశారా లేదు.. మనలాంటి వాళ్లే రాయినో, రప్పనో కొలిచి.. వాళ్లకు కష్టం వచ్చినప్పుడు ధైర్యం కోసం ఇలా చేసుకుంటూ వచ్చారు. వాళ్ల భయం నుంచి, ఆకలి నుంచి, ఆశల నుంచి, తీరని కోరికల నుంచి దేవుడు పుట్టాడు అని చెప్పాడు. ఇవన్ని లాజిక్ కు అందని ప్రశ్నలు కావునా.. దేవుడు ఉన్నాడా.. అంటే లేడని చెప్పండి అంటూ పూరీ తనదైన శైలిలో వివరించాడు.