కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు పెద్దలు. అయితే ఇక్కడ ఓ కుర్రాడు తెలిసి చేశాడా.. తెలియక తప్పు చేశాడా అనేది తెలియదు కానీ.. చేసిన తప్పుకు భయంకరమైన శిక్ష విధించారు. ఇంతకు అతడు చేసిన తప్పేంటంటే.. 8 ఏళ్ల వయస్సు ఉన్న కుర్రాడు.. ఓ మదర్సా లైబ్రరీలో మూత్ర విసర్జన చేశాడు. దీంతో అతడిపై కేసు పెట్టారు. పోలీసు ప్రొటెక్టివ్ కస్టడికి పంపారు. అతడు హిందూ బాలుడు. ఇలా తెలియక చేసిన తప్పుతో ఇబ్బందుల్లో పడ్డాడు.
పాకిస్తాన్ ఇది పెద్ద నేరంగా పరిగణించారు. ఆ బాలుడు దైవ దూషణకు పాల్పిడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. పాకిస్తాన్ లో దైవ దూషణకు పాల్పడినవారికి మరణ శిక్ష విధిస్తారు. ఇలా ఈ ఆరోపణలు ఎదుర్కొని కేసు పెట్టిన వారిలో ఈ బాలుడిదే అతి చిన్న వయస్సు. ఆ లైబ్రరీలో మత పరమైన పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. కానీ ఈ కుర్రాడు తనకు తెలిసే ఇలా చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. కానీ ఆ బాలుడి తల్లిదండ్రులు మాత్రం అతడు కావాలని చేయలదని.. తన కుమారుడికి ఏ పాపం తెలియదని వేడుకున్నారు.
ఆ వయస్సులోని వారికెవరికైనా ఏం తెలుస్తుందని ఆ బాలుడి కుటుంబం అంటోంది. ఇటీవల పంజాబ్ ప్రావిన్స్ లోని రహీం యార్ ఖాన్ జిల్లాలో ఓ హిందూ ఆలయంపై ఓ గుంపు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బాలుడు కూడా ఆ ఆలయ సమీపంలోని నివసించే కుటుంబాల్లో ఒకడిగా గార్డియన్ పత్రిక పేర్కొంది. అప్పుడు గుంపు దాడిలో పాల్పడిన సుమారు 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
అయినా అక్కడ నివసిస్తున్న హిందూ కుటుంబాలు భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. భయంతో ఆ బాలుడి కుటుంబం కూడా ఎక్కడో అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళింది. తమకు ఇక్కడ రక్షణ కరువైందని.. అమాయకుడైన తన కుమారుడిని వాళ్లు ఏం చేస్తారో అని వాళ్లు ఆవేదన చెందుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…