దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఉధృతి కొనసాగుతున్నా పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు తెరవడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. అయితే పాఠశాలలు తెరిచే విషయంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మార్చి నెల 31వ తేదీ వరకు స్కూల్స్ బంద్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అధికారులతో చర్చించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే రాష్ట్రంలో స్కూల్స్ బంద్ కొనసాగినా 10, 12 తరగతుల విద్యార్థులకు మాత్రం యథాతథంగా క్లాసులు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ లో ప్రతి సంవత్సరం ఐదు, ఎనిమిది తరగతుల బోర్డు పరీక్షలు జరిగేవి.
అయితే ఈ సంవత్సరం ప్రభుత్వం ఆ పరీక్షలను కూడా రద్దు చేయడం గమనార్హం. అయితే తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులకు రెండు రోజుల పాటు తరగతులు జరగనున్నాయి. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ ఆధారంగా మార్కులు కేటాయించనున్నట్టు వెల్లడించారు. 2021 ఏప్రిల్ నెలలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని సమాచారం.
ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని మధ్యప్రదేశ్ సర్కార్ వెల్లడించింది. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుంచి ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…