Mrunal Thakur: పలు బాలీవుడ్ బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మృణాల్ ఠాకూర్ అనంతరం బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకున్నారు ఇలా బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె హనురాగవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మృణాల్ ఠాకూర్ అనంతరం నాని సినిమాలో నటించే అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఈమె రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలో కూడా నటించే అవకాశాన్ని అందుకున్నారు ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటు ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను పంచుకునే మృణాల్ తాజాగా తన మనసులో కోరికను బయటపెట్టారు.
ఈ సందర్భంగా మృణాల్ మాట్లాడుతూ నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి నాకు ఒక పెద్ద కల ఉందని తెలిపారు. అయితే ఆకల నెరవేరాలని ప్రతిరోజు తాను కోరుకుంటున్నానని తెలిపారు.మరి ఈమె ఆ కోరిక కళ ఏంటి అనే విషయానికి వస్తే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి తనకు మహేష్ బాబుతో నటించడం ఒక డ్రీమ్ గా మారిందని మృణాల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈమె కల నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…