Mukesh Ambani: మెగా వారసురాలు బారసాలు వేడుక నేడు ఎంతో ఘనంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీనితో నేడు మెగా వారసురాలిని పరిచయం చేయబోతున్నారని అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
రామ్ చరణ్ ఉపాసనలకు 10 సంవత్సరాలు తర్వాత కూతురు పుట్టడంతో ప్రతి వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బారసాల వేడుకను అత్యంత కనుల పండుగగా జరిపించబోతున్నారని సమాచారం. ఈ బారసాల వేడుకకు మెగా కుటుంబ సభ్యులతో పాటు ఇతర బంధువులు అత్యంత సన్నిహితులు హాజరుకానున్నట్లు సమాచారం.
ఇక నేడు బారసాల వేడుకను నిర్వహించడంతో పెద్ద ఎత్తున మెగా ప్రిన్సెస్ కోసం కానుకలు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఏకంగా బంగారపు ఉయ్యాల కానుకగా పంపించారని తెలుస్తోంది. ఇలా రామ్ చరణ్ కుమార్తె కోసం ముఖేష్ అంబానీ బంగారంతో తయారు చేసిన ఊయలను పంపించారన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ చిన్నారి కోసం దాదాపు రెండు కిలోలకు పైగా బంగారం ఉపయోగించి ఈ ఊయల తయారు చేశారని సమాచారం. మరి ఈ ఊయల కోసం ఏకంగా 1.20 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని తెలుస్తోంది. కొన్ని లక్షల కోట్లకు అధిపతి అయినటువంటి ముఖేష్ అంబానీ ఇలా రాంచరణ్ కూతురి కోసం బంగారపు ఊయల పంపించడంతో రామ్ చరణ్ ఉపాసన దంపతులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…