బుల్లితెరపై యాంకర్ రష్మి గౌతమ్ -సుడిగాలి సుధీర్ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బుల్లితెరపై వీరిద్దరూ కలిసి చేసే రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. వీరుచేసే పలు వీడియో డాన్సులు, స్కిట్లు చూస్తే నిజంగానే వీరిమధ్య ప్రేమ ఉందా అంటూ సందేహం వ్యక్తం చేయక మానరు.
అదే విధంగా ఈ జంటకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకుని ఎంతోమంది నిర్వాహకులు ఈ జంటతో తమ కార్యక్రమాలలో పాల్గొనాలని చెబుతుంటారు. అదే విధంగా ఎన్నో కార్యక్రమాలలో సుధీర్ -రష్మి కు పెళ్లి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా పలు స్కీట్ల ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పవచ్చు.
ఇలా రష్మీ – సుధీర్ జంటకు పెళ్లి చేసిన ముచ్చట చూసి చాలా మంది ప్రేక్షకులు నిజంగానే వీరిద్దరికీ పెళ్లి అయితే ఎలా ఉంటుంది అని భావించారు. తాజాగా సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఏకంగా ఓ జబర్దస్త్ కమెడియన్ కూడా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని చెప్పారు.
ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్స్ పాల్గొనే సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుదీర్ అక్కడ ఉన్నటువంటి కొందరిని మీకు చివరి కోరిక ఏంటి అంటూ అందరినీ ప్రశ్నించగా అందరూ ఒక్కో విధమైన సమాధానం చెప్పారు. అయితే సుడిగాలి సుదీర్ టీమ్ లో ఉన్నటువంటి ఆటో రాంప్రసాద్ ని కూడా సుడిగాలి సుదీర్ ఇదే ప్రశ్న అడగగా అతను అందరికంటే భిన్నంగా సమాధానం చెప్పాడు. నాకు రష్మీ సుధీర్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది. అదే నా చివరి కోరిక అనగా… అందుకు సుదీర్ ఏవైనా జరిగే కోరికలు చెప్పరా… అంటూ హాస్యం పండించాడు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…