Naga Chaitanya: నాగచైతన్య తాజాగా అమీర్ ఖాన్ కరీనాకపూర్ జంటగా నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా ఈ సినిమాలో నాగచైతన్య బాలరాజు అనే పాత్రలో సందడి చేశారు. ఈ పాత్రలో నటించిన ఈయన నటనకు ప్రశంసలు అందడంతో వరుసగా బాలీవుడ్ ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఇలా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న నాగచైతన్య తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ క్రమంలోనే గతంలో తాను గర్ల్ ఫ్రెండ్ తో అడ్డంగా పోలీసులకు దొరికిపోయాను అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ తాను తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి కారు బ్యాక్ సీట్లో కూర్చుని తనకు ముద్దు పెట్టబోతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని తెలిపారు. ఇలా గర్ల్ ఫ్రెండ్ తో పోలీసులకు దొరికిపోయానని నాగచైతన్య చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ విధంగా గర్ల్ ఫ్రెండ్ కు ముద్దు పెట్టడం తనకు దృష్టిలో తప్పు విషయం కాదంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విధంగా నాగచైతన్య తనకు గర్ల్ ఫ్రెండ్ ఉందనే విషయాన్ని చెప్పారు కానీ ఆమె ఎవరు తన పేరు ఏంటి అనే విషయం మాత్రం బయట పెట్టలేదు. మొత్తానికి గర్ల్ ఫ్రెండ్ గురించి ఈ విధంగా నాగచైతన్య ఓపెన్ కావడం గమనార్హం.
ఇకపోతే ఇదివరకు నాగచైతన్య ఎక్కడ ఎలాంటి ఇంటర్వ్యూలలో కూడా పెద్దగా పాల్గొనేవారు కాదు. ఒకవేళ ఇంటర్వ్యూలకు హాజరైన కేవలం సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే ప్రస్తావించేవారు. ఎక్కడ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే వారు కాదు. అయితే సమంతతో విడాకుల తర్వాత తాను వ్యక్తిగతంగా కూడా చాలా మారిపోయానని ఒకానొక సందర్భంలో నాగచైతన్య వెల్లడించిన విషయం మనకు తెలిసిందే.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…