Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన నటించిన థాంక్యూ సినిమా కాస్త నిరాశపరిచినప్పటికీ సరికొత్త ఉత్సాహంతో దర్శకుడు వెంకట్ ప్రభు సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం కర్ణాటకలో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా కర్ణాటక, మాండ్య జిల్లాలోని మేల్కోటీ గ్రామంలో జరుగుతుంది. అయితే అక్కడ అధికారుల అనుమతి తీసుకుని ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్లో భాగంగా చిత్ర బృందం ఒక వైన్ షాప్ సెటప్ వేశారు.
వైన్ షాప్ సెట్ వేసిన ప్రాంతంలో రాయగోపురా దేవాలయం ఉంది. ఇలా ఆలయం ప్రాంగణంలో వైన్ షాప్ సెట్ వేయడమే కాకుండా ఈ వైన్ షాప్ సెట్లో చిందులు వేస్తూ షూటింగ్ జరుపుకుంటూ ఉండగా స్థానికంగా ఉన్నటువంటి ప్రేక్షకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా చిత్ర బృందంపై దాడి చేశారు. పవిత్రమైన దేవాలయం ఉండే ప్రాంతంలో ఇలా వైన్ షాప్ సెట్ వేయడమే కాకుండా హిందూ ధర్మాన్ని అవమాన పరుస్తున్నారంటూ పెద్ద ఎత్తున మండిపడ్డారు.
ఈ క్రమంలోనే స్థానిక ప్రజలు ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వగా రంగంలోకి దిగిన పోలీసులు సినిమా షూటింగును రద్దు చేశారు. సినిమా షూటింగ్ కిఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేయడంతో చిత్ర బృందం చేసేదేమి లేక ఈ సినిమా షూటింగ్ ఆపివేశారు.ఇలా వైన్ షాప్ సెట్ వేసిన తర్వాత షూటింగ్ ఆపివేయడంతో భారీ మొత్తంలోనే నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయం గురించి చిత్ర బృందం ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం. ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…