Mrunal Thakur: మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె పలు బాలీవుడ్ సినిమాలు,పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈమె తాజాగా సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.మొదటి సినిమాతోనే సీతామహాలక్ష్మి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా సీతారామం సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మృణాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను వెల్లడించారు. తాను హిందీలో సినిమా చేయడం కోసం రెండు వారాలపాటు వేశ్య గృహంలో ఉన్నానని ఈమె తెలిపారు.ఒకానొక సమయంలో ఎంతో డిప్రెషన్ లోకి వెళ్లిన తాను ట్రైన్ నుంచి దూకి చనిపోదామని భావించానని అయితే తన తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో తన ఆలోచనను విరమించుకున్నానని తెలిపారు.
ఇకపోతే తన కెరీర్ గురించి మాట్లాడుతూ తనకు పలు సినిమా అవకాశాలు వస్తున్నాయని అయితే ఎక్కడికి వెళ్ళినా తనకు ఒక పెద్ద సమస్య ఏర్పడిందని తెలిపారు. ఎంతోమంది దర్శకులు నాకు కథ వివరించిన అనంతరం నా వయసు గురించి అడుగుతున్నారని తన వయసు 30 సంవత్సరాల అని చెప్పగా అసలు సమస్య మొదలైందని ఈమె తెలిపారు.
30 సంవత్సరాలు వయసు వచ్చిన ఇంకా పెళ్లి చేసుకోలేదా వెంటనే పెళ్లి చేసుకోండి అంటూ కొందరు సలహాలు కూడా ఇస్తున్నారు. ఈపాటికి మీరు ప్రేమలో పడే ఉంటారు కదా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. సరైన వరుడి కోసం ఎదురు చూస్తున్నావా అంటూ ఎన్నో రకాలుగా ప్రశ్నిస్తూ చాలామంది ఉచిత సలహాలు ఇస్తున్నారని అయితే ఇలా సలహాలు వింటూ ఉంటే తనకు చాలా చిరాకుగా ఉందంటూ ఈ సందర్భంగా ఈమె తన సమస్యను బయటపెట్టారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…