Anantha Sriram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినీ గేయ రచయితగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అనంత శ్రీరామ్. ఈయన ఎన్నో అద్భుతమైన పాటలను ప్రేక్షకులకు అందించారని చెప్పాలి. ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనంత శ్రీరామ్ చేసిన వాక్యాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా అనంత శ్రీరామ్ మాట్లాడుతూ…రామాయణంలో రాముడు, సీతాదేవిని గాయపర్చిన కాకిపైకి గరికెను బ్రహ్మాస్త్రంగా సంధిస్తాడు. రాముడు ఈ విధంగా ఆ గరికను పట్టుకోవడం వల్ల గరిక విలువ ఎంతో పెరిగింది కానీ తగ్గలేదు. గరిక ఈ విషయాన్ని వినయంతో ఒప్పుకోవాలి తప్ప అహంకారం ప్రదర్శించకూడదని అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ విధంగా గరిక గురించి అనంత శ్రీరామ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈయన పరోక్షంగా గరికపాటిని ఉద్దేశించి చేశారంటూ మరో వాదన తెరపైకి వచ్చింది.ఈ విధంగా అనంత శ్రీరామ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనంత శ్రీరామ్ ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను గరిక గురించి చేస్తున్న వ్యాఖ్యలు యాదృచ్ఛికంగా చేశాను అని చెప్పడం అబద్ధం అవుతుంది… ఉద్దేశపూర్వకంగానే తాను గరిక గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశానని ఆయన వెల్లడించారు.అయితే ఆయన గరిక గురించి చెప్పారా లేదా గరికపాటి గురించి ఈ వ్యాఖ్యలు చెప్పారా అనే విషయంపై ఇంటర్వ్యూ సందర్భంగా కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఏది ఏమైనా ఈయన పరోక్షంగానే గరికపాటిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…