Nayanathara -Vignesh Shivan: లేడీ సూపర్ స్టార్ నయనతార గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈమె గత కొన్ని సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా వీరి వివాహం జరిగి నాలుగు నెలలు అయింది.
ఈ విధంగా వివాహం జరిగిన తర్వాత ఈ జంట వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూ పలు విదేశీ పర్యటనలలో ఉంటూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.ఇకపోతే వీరి గురించి అన్ని విషయాలను అభిమానులతో పంచుకొని విగ్నేష్ తాజాగా ఈ దంపతులు ఇద్దరు మగ కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యామని సోషల్ మీడియా వేదికగా పిల్లలను ముద్దాడుతూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చారు.
ఈ సందర్భంగా నయనతార విగ్నేష్ ఇద్దరు తమ పిల్లల పాదాలను ముద్దు పెడుతూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ… భగవంతుడి ఆశీస్సులు, పూర్వీకుల ఆశీర్వాదంతో తామిద్దరం ఇద్దరు మగ పిల్లలకు తల్లిదండ్రులు అయ్యామని మా పిల్లలపై మీ ప్రేమ ఆశీర్వాదాలు కూడా ఉండాలంటూ ఈయన పిల్లల ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్ అయ్యారు.
వీరిద్దరికి వివాహం జరిగి నాలుగు నెలలు కూడా పూర్తికాకుండానే పిల్లలకు జన్మనివ్వడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెళ్లికి ముందే పిల్లలను సరోగసి పద్ధతి ద్వారా కనాలని నిర్ణయం తీసుకొని ముందే ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది.ఇలా పెళ్లికి ముందే సరోగసి ప్లాన్ చేసినటువంటి ఈ దంపతులు తాజాగా కవల మగ పిల్లలకు తల్లిదండ్రులు అయినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా నయనతార దంపతులు తల్లిదండ్రులు కావడంతో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు, అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…