Featured

Pruthvi Raj : నన్ను స్టంట్ మాన్ కూడా మోయలేక పోయాడు కానీ బాలకృష్ణ నన్ను ఎత్తుకుని పరిగెత్తారు… తెలుగు ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన హీరో అతనే : పృథ్వీ

Pruthvi Raj : రుక్కు రుక్కు మని రమనిస గుణమని పాట అనగానే గుర్తొచ్చే పేరు పృథ్వీ. ఆ పాట వచ్చి ఎన్నేళ్లయినా ఇప్పటికీ ఆయనను పెళ్లి సినిమా పృథ్వీ గానే గుర్తుపడతారు తెలుగు ప్రేక్షకులు. సినిమాలతో మొదలు పెట్టి సీరియల్స్ లోకి వెళ్లి తమిళ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయిన పృథ్వీ తెలుగులో మాత్రం పెళ్లి పృథ్వీగా బాగా ఫేమస్ అయ్యాడు. పెళ్లి సినిమా కంటే ముందే పృథ్వీ తెలుగులో సినిమాలు చేసిన పెళ్లి సినిమాతో వచ్చిన ఫేమ్ వల్ల పెళ్లి పృథ్వీ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత అడపాదడపా సినిమాలు చేసినా మళ్ళీ సమర సింహ రెడ్డి, మన్మధుడు, చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరోగానే నటించాలనే నియమేమి పెట్టుకోకుండా ఇతర హీరోల సినిమాలలో కూడా నటించాడు పృథ్వీ. అయితే చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ చాలా కాలం తరువాత రీఎంట్రీ ఇచ్చిన పృథ్వీ గారు పలు ఇంటర్వ్యూల్లో ఆసక్తికర విషయాలు మాట్లాడారు.

అలా ఎలా మొశారని అడిగాను…

బాలకృష్ణను అన్న అని పిలిచే అలవాటు ఉంది అంటూ ఆయన గురించి పృథ్వీ గారు మాట్లాడారు. సమర సింహ రెడ్డి సినిమాలో వాసు అనే కీలకపాత్రలో నటించిన పృథ్వీ ఆ సినిమాలో జరిగిన ఒక సంఘటన పంచుకున్నారు. సినిమాలో వాసు పాత్రను కత్తితో పొడిస్తే హీరో చేతుల్లో ఎత్తుకుని తీసుకెళ్లే సీన్ ఉంది. అయితే స్టంట్ మాన్ పృథ్వీ ని పైకి ఎత్తి బరువుగా ఉన్నావు ఎత్తడం కావడం లేదని అన్నారు. ఇక బాలకృష్ణ కు డూప్ పెట్టి జూమ్ లో చూపిద్దాం అంటే 85 కేజీల బరువును ఆయన ఎత్తుకుని పరిగెత్తారు.

బాలకృష్ణ గారి దగ్గరకు వెళ్లి ఎలా ఎత్తారు అసలు అంటే నేను కాదు మోసింది సమరసింహా రెడ్డి అని చెప్పారు. ఇక మళ్ళీ ఆయనతో చెన్నకేశవ రెడ్డి, కథానాయకుడు సినిమాల్లో నటిచాను, ‘అన్నా’ అనే పిలుస్తాను ఆయన అంటే చాలా ఇష్టం అంటూ చెప్పారు పృథ్వీ. ఇక తెలుగులో ఇష్టమైన హీరో అంటే బాలకృష్ణ అంటూ చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ గారు అప్పటి హీరోల్లో నెక్స్ట్ జనరేషన్ లో బాలకృష్ణ గారు ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం అంటూ చెప్పారు. ఆ కుటుంబాలోని ముగ్గురు హీరోలు నాకు ఇష్టం అని చెప్పారు. ఆ ముగ్గురితోనూ నటించారు పృథ్వీ.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago