Featured

Prabhas Seenu : వాళ్ళు చేసిన మోసానికి లక్షల్లో డబ్బు నష్టపోయాను… మా నాన్న ముందు నా కలర్ గురించి మాట్లాడాడు : ప్రభాస్ శీను

Prabhas Seenu : పిల్లా నువ్వు లేని జీవితం, ఛత్రపతి, గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్య వంటి సినిమాల్తో కమెడియన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న శ్రీనివాస్, ప్రభాస్ శీను గానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గబ్బర్ సింగ్ లో తన నటనకు మంచి ప్రశంసలే కాకుండా అవకాశాలు కూడా వచ్చాయి. అయితే సరైన ప్లానింగ్ కెరీర్ మీద పెట్టకపోవడం వల్ల ఆర్థికంగా కూడా బాగా నష్టపోయిన ప్రభాస్ శీను తన కెరీర్ మొదట్లో అనుభవాలను అవమానాలను తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. తనతో నటించిన నటుల గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్న శీను, తాను ఎదుర్కొన్న అవమానాలను అలాగే తాను ఇతరుల వల్ల మోసపోయిన సందర్భాలను పంచుకున్నారు.

వాళ్ళను నమ్మి చాలా డబ్బులు నష్టపోయాను…

సినిమాల్లోకి వచ్చిన తరువాత పక్కన వ్యాపారం చేద్దామని అలోచించి వినాయక ఫుడ్ సెంటర్ పెట్టాను. నేను నమ్మిన వినాయకుడు నాతోనే ఉన్నాడు చేసిన ఫుడ్ పోయింది కానీ డబ్బులు రాలేదు లక్షల్లో డబ్బులు నష్టపోయాను. జీవితంలో వంటవాళ్ళను నమ్మకూడదని తెలుసుకున్నాను. వంట బాగా చేస్తాడని వెళ్లి న దగ్గర పని చేయమని అడిగితే ఇక్కడ ఒక లక్ష తీసుకున్నా మూడు లక్షలు తీసుకున్నా అంటే నేను అప్పు తీర్చి పనిలో పెట్టుకుంటే ఒక్కరోజు సరిగా టైంకి పని చేయలేదు. పదకొండు గంటలకంతా ఫుడ్ రెడీగా ఉండాలంటే వాళ్ళు ఉదయాన్నే రాకపోతే నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఆ దెబ్బతో నేను వ్యాపారం వైపు వెళ్ళలేదు. నాకు చేత కాదు నేను ఆ టెన్షన్ భరించలేను అని అర్థమైంది అంటూ చెప్పారు.

మా నాన్న ముందు నా కలర్ గురించి మాట్లాడారు…

ప్రభాస్ శీను గారి తండ్రి రెవెన్యూ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఇక ఆయన సహఉద్యోగి ఒకరు ఇంటికి వచ్చినపుడు మాటల సందర్బంలో శీను గురించి అడిగారట. సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నాడు అని చెబితే ఈ ముఖంతో సినిమాల్లోకి ఏం వెళ్తాడు, ఎలా పైకి వస్తాడు అంటూ కలర్ గురించి మాట్లాడారట. చాలా బాధేసింది నీకెందుకు రా యదవ అని అనాలనిపించింది. ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది మాటలు నన్ను బాధించేవి కానీ నా అనుకున్న వాళ్ళు నన్ను అవమానిస్తే గుర్తు పెట్టుకుని అనాలని అనుకుంటాను కానీ ఎవరో తెలియని వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించను అంటూ చెప్పారు శీను.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago