Manchu Lakshmi : మంచు వారి కుటుంబంలో మోహన్ బాబు గారి తరువాత విష్ణు, లక్ష్మి, మనోజ్ లు సినిమాల్లోకి అడుగుపెట్టి వారి కంటూ ఒక సొంత ఇమేజ్ ను తెచ్చుకున్నారు. ముఖ్యంగా మంచు లక్ష్మి అయితే తన తెలుగు యాసతో ఫేమస్. ఇక మంచు లక్ష్మి సినిమాల్లోనే కాకుండా బుల్లితెర మీద కూడా పలు ప్రోగ్రామ్స్ చేస్తూ ఫేమస్ అయింది. ఆమెరికా నుండి వచ్చిన మంచు లక్ష్మి అక్కడ వెబ్ సిరీస్ లు నటిస్తూ నటన మీద ఇష్టాన్ని చంపుకోలేదు. ఇక ఆమె ప్రస్తుతం పలు భాషలలో వివిధ ప్రాజెక్ట్స్ తో బిజీగ ఉంటూనే సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉన్నారు. ఇక రీసెంట్ గా మంచు మనోజ్ గురించి రెండో పెళ్లి వార్త తెగ వైరల్ అయింది, ఈ విషయంలో మంచు లక్ష్మి స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఎవడి దూల వాడిది… వాడి బతుకు వాడి ఇష్టం…
మంచు మనోజ్, భూమా మౌనికను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వినాయక చవితి సందర్బంగా వీళ్లిద్దరూ సీతఫల్ మండిలో గణేషుడి దర్శనానికి జంటగా వచ్చి మీడియా కంట పడ్డారు. దీంతో వెళ్ళిద్దరి పెళ్లి ఫిక్స్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం గురించి మంచు ఫ్యామిలీ నుండి ఏ ఒక్కరూ స్పందించలేదు అయితే తాజాగా మంచు లక్ష్మి కి మీడియా నుండి ఈ ప్రశ్న ఎదురైంది. మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి అడుగగా లక్ష్మి ఎవడి దూల వాడిది, వాడి జీవితం వాడి ఇష్టం అంటూ కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.
వాళ్ళు నిజంగానే ప్రేమించుకుంటుంటే కలిసి సంతోషంగా ఉంటారంటే అంతకన్నా ఏమి కావాలి అంటూ, ఎవరికైనా రెండు ఎమోషన్స్ కామన్ ఒకటి ప్రేమ ఇంకొకటి భయం, ఈ రెండు ఎమోషన్స్ లో దేనితో లైఫ్ లీడ్ చేస్తున్నామనేది ముఖ్యం. నేను నా లైఫ్ ని లవ్ తో లీడ్ చేస్తున్నా అంటూ చెప్పింది. ఇక మంచు ఫ్యామిలీ పై వచ్చే ట్రోల్స్ గురించి మాట్లాడుతూ అవన్నీ బుల్ షిట్ ఇప్పటికీ మోహన్ బాబు గారి పిల్లలుగా మమ్మల్ని అందరూ గౌరవిస్తారు ప్రేమిస్తారు. ఈ నెగెటివిటీ అంతా ఎక్కడినుండి వస్తోందో తెలియదు. కానీ ఈ ట్రోల్స్ వల్ల కూడా కొత్త పాఠాలు నేర్చుకున్నాం అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…