Nagababu: మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి త్వరలోనే నటి లావణ్య త్రిపాఠి కోడలుగా అడుగుపెట్టబోతున్నారు. ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇన్ని రోజులు తమ ప్రేమ విషయాన్ని దాస్తూ వచ్చినటువంటి ఈ జంట ఎట్టకేలకు తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టడమే కాకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.
ఇలా వీరి నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే త్వరలోనే వీరిద్దరి వివాహం కూడా ఎంతో ఘనంగా జరగబోతుందని తెలుస్తుంది.వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లావణ్య త్రిపాఠి గతంలో మెగా హీరోలు అయినటువంటి సాయి ధరంతేజ్ అలాగే అల్లు శిరీష్ వంటి హీరోలతో ప్రేమలో ఉందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇక లావణ్య త్రిపాఠి కూడా హస్బెండ్ మెటీరియల్ ఎవరు అంటే వెంటనే సాయి ధరమ్ పేరు చెప్పారు. ఇలా తమ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని, తామిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ తెలియజేశారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓల్డ్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ ఇద్దరి మెగా హీరోలతో లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఇలా లావణ్య గురించి ఈ విధమైనటువంటి వార్తలు సోషల్ మీడియాలో వినిపించినప్పటికీ నాగబాబు మాత్రం తనని కోడలిగా అంగీకరించడంతో ప్రతి ఒక్కరు లావణ్య గురించి ఈ విషయాలు తెలిసి నాగబాబు తన కోడలుగా ఒప్పుకున్నారా అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో జరగబోతుందని తెలుస్తుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…