Singer Mangli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ మంగ్లీ ఒకరు. ఈమె ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాటలను పాడుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కెరీర్ మొదట్లో ప్రవేట్ సాంగ్స్ పాడుతూ ఆ పాటలకు వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసేవారు.
మంగ్లీ పాడిన పాటలకు ఎంతో మంచి ఆదరణ రావడంతో ఈమెకు ఎంతో మంది అభిమానులుగా మారిపోయారు. దీంతో ఈమెకు సినిమాలలో కూడా పాటలు పాడే అవకాశాలు వచ్చాయి.ఎన్నో అద్భుతమైన పాటలను పాడుతూ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మంగ్లీ అనంతరం తెలుగు భాషలో మాత్రమే కాకుండా కన్నడ భాషలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా వరుసగా పాటలు పాడుతూ అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.ఇక ఏదైనా పండుగ వచ్చిందంటే ప్రతి ఏడాది మంగ్లీ తప్పకుండా ఆ పండుగ గురించి పాట పాడి ఆ పాటకు వీడియోలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో బోనాలు పండుగ రావడంతో ఈమె బోనాల పండుగ కోసం ఒక పాటను పాడి ఈ పాటకు వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ఈమెకి ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
ఇలా ఈ ప్రమాదంలో మంగ్లీ కాలికి గాయం తగిలిందని అయితే వెంటనే వైద్యుని సంప్రదించగా పెద్దగా ప్రమాదం ఏమి జరగలేదని,కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అంటూ వైద్యులు సూచించినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు ఈమె తొందరగా కోలుకోవాలని పెద్ద ఎత్తున ప్రార్థిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…