టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ మధ్య కాలంలో సినిమాల విషయంలో కాస్త వెనకపడ్డాడనే చెప్పాలి.. ఈ సీనియర్ హీరోకి మంచి హిట్ లేక చాలా కాలం అవుతుంది. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఇటీవల వచ్చిన వైల్డ్ డాగ్ సినిమాకూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకా పోయింది. సినిమాలో రా అండ్ రస్టిక్ యాక్షన్ తో NIA ఆఫీసర్ రోల్ లో కొత్తగా కనిపించారు నాగ్ .
ప్రభు సోలొమన్ టేకింగ్ కూడా రిచ్ గా ఉందన్న కాంప్లిమెంట్స్ వచ్చాయి. కానీ సినిమా మాత్రం నిరాశపరిచింది.సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా నాగ్ స్టోరీ సెలెక్షన్ కి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.సినిమాలో ఫిమేల్ లీడ్ లో దియా మీర్జా నటిస్తే.. సయామీ ఖేర్, అతుల్ కుల్ కర్ణి కీలకపాత్రల్లో కనిపించారు. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ ఎవరితో సినిమా చేయబోతున్నారన్నది ఇప్పడు ఆసక్తిగా మారింది.
ఈ క్రమంలో నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్‌మరార్ నిర్మిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుందని తెలుస్తుంది.ఈ సినిమాలో నాగ్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా సెకండ్ షెడ్యూల్‌ను జూన్ తొలివారంలో ప్రారంభించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్‌లో నాగార్జున, కాజల్ అగర్వాల్‌లపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. హైదరాబాద్‌లో పాటు ఊటీ, లండన్, దక్షిణ కొరియాలో ముఖ్యఘట్టాల్ని తెరరకెక్కిస్తామని చిత్రయూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించని డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నాడట నాగ్..!!
మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…
నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…
వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…