Nallamala Movie Review: నల్లమల రివ్యూ: ప్రేక్షకులను మెప్పించిన నల్లమల సినిమా!
Nallamala Movie Review: చిత్రం: నల్లమల
నటీనటులు: అమిత్ తివారీ, భాను శ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ముక్కు అవినాష్ తదితరులు
నిర్మాత: ఆర్ ఎమ్
దర్శకత్వం: రవి చరణ్
సంగీతం: పీ ఆర్
విడుదల తేదీ: 2022-03-18
ఈరోజు నల్లమల సినిమా ప్రేక్షకుల ముందుకు మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కగా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో.. అంతేకాకుండా హీరోగా నటించిన అమిత్ తివారీ కి ఈ సినిమా ఎటువంటి సక్సెస్ ను అందించిందో చూద్దాం.
కథ: ఈ సినిమా అటవీ ప్రాంతంలో జరిగే అక్రమ వ్యాపారాల నేపథ్యంలో తెరకెక్కింది. ఇక అటవీ ప్రాంతంలో ప్రకృతిని, సాధు జంతువులను ప్రేమించే యువకుడిగా నల్లమల అనే పాత్రలో అమిత్ తివారీ నటించాడు. ఇక ఈయన అక్కడున్న వారికి సహాయం చేస్తూ ఉంటాడు. ఇతడికి మేలు రకం జాతి ఆవులు అంటే చాలా ఇష్టం. ఈయన వనమాలి (భాను శ్రీ) ను ఇష్టపడతాడు. ఇక ఈయన అక్రమంగా రవాణా చేసే వారిని అడ్డుపడతాడు. చివరికి ఈయన ఇలా ఎందుకు చేస్తున్నాడు అనేది మిగిలిన కథ లో చూడవచ్చు.
విశ్లేషణ: ఇక ఈ సినిమాను ఆ డైరెక్టర్ మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కించాడు. ఇందులో నాజర్ శాస్త్రవేత్త పాత్రలో నటించగా ఆయనను గిరిజనులు వెంటాడటంతో ఎమోషనల్ పాయింట్ తో సినిమానే చూపిస్తాడు. ఇంట్రెస్ట్ టాపిక్ తో కథ మొత్తం బాగా లోతుగా వెళుతుంది. ఫ్లాష్ బ్యాక్ కథ మొత్తం చాలా ఆసక్తిగా చూపించాడు డైరెక్టర్. టెక్నికల్ పరంగా సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. మంచి సంగీతాన్ని రుచి చూపించాడు పీ ఆర్. బ్యాక్ గ్రౌండ్ సన్నివేశాలు మాత్రం బాగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు ఎంతో అనుభవం ఉన్న వారిగా కథను తెరకెక్కించాడు.
ప్లస్ పాయింట్స్: నటీనటుల నటన, సంగీతం, పాటలు, సినిమా కథ, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్: సినిమా నెమ్మదిగా సాగినట్లుగా ఉంది.
రేటింగ్: 2.75/5
ఉమ్మడి కుటుంబాలతో కలిసి ప్రయాణాలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సెలవులు, పండుగలు, ప్రత్యేక సందర్భాలు—ఇలాంటి సమయాల్లో ఒకే వాహనంలో…
కొద్ది రోజుల్లో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ మార్కెట్‌లోకి రాబోతోంది. అంతకు ముందే, S24 స్మార్ట్‌ఫోన్ ధరలో పెద్ద తగ్గింపు…
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…