Nandamuri Balakrishna : నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ తరువాత బాలకృష్ణ, హరికృష్ణ, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, తారక రత్న సినీ పరిశ్రమకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. హీరోలే కాదు, కొంతమంది పలు నిర్మాణ సంస్థలు స్థాపించి సినిమాలు నిర్మించటం కూడా జరిగింది. అయితే ఇపుడు మరొక హీరో నందమూరి కుటుంబం నుండి హీరోగా పరిచయం కాబోతున్నాడు.
పోస్టర్ ఆవిష్కరణ చేసిన బాలయ్య…
నందమూరి తారక రామారావు గారి పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ, ‘బసవతారకరామ’ క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించడం జరిగింది. జయకృష్ణ వారి బ్యానర్ లో మొదటి చిత్రాన్ని వాళ్ళ అబ్బాయి చైతన్య కృష్ణను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తుండటం విశేషం. అయితే ఈ సినిమాకి సంబందించిన పోస్టర్ ను నందమూరి బాలకృష్ణ చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సినిమాను ఇదివరకు రక్షణ, జక్కన్న సినిమాలను దర్శకత్వం వహించిన వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సంధర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ… ఈ బ్యానర్ కూడా ఇదివరకు నందమూరి కుటుంబం నుంచి వచ్చిన బ్యానర్ లలో ఒకటిగానే భావిస్తున్నాను, ఇది కూడా మంచి విజయం సాదించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. ఇక చైతన్య కృష్ణ గురించి చెబుతూ, మా అబ్బాయి, అంతే కాదు మా నాన్న గారికి ఇష్టమైన మనవడు, తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలియజేసారు. ఇక దర్శకుడు, చిత్రబృందానికి అభినందనలు తెలియజేసారు. అంతేకాకుండా తండ్రితో సమానమైన మా పెద్దన్నయ్య ఆశీర్వాదాం నాకుకూడా కావాలి అని పాదాభివందనం చేయడం అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…