Featured

Nandamuri KalyanRam : భార్య పేరుని పచ్చబొట్టు వేయించుకున్న కళ్యాణ్ రామ్… తన మీద ప్రేమను చెప్పకనే చెప్పాడుగా..!

Nandamuri KalyanRam : కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం బింబిసార. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. ఎంత మంచివాడవురా సినిమా తరువాత చాలా గ్యాప్ తో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. బింబిసార సినిమాకి సంబంధించి ట్రైలర్ కూడా ఇటీవల విడుదల చేశారు. ప్రేక్షకులను సైతం ఈ ట్రైలర్ బాగా ఆకట్టుకుంది. అయితే ట్రైలర్ విడుదల కార్యక్రమం కూడా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హీరో కళ్యాణ్ రామ్ చేతికి పచ్చబొట్టు కెమెరా కంటికి చిక్కింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా వుంది.

తన భార్య స్వాతి పేరును పచ్చబొట్టుగా…

అభిమానులలో నందమూరి వారసులకు వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. నందమూరి నట వారసులలో కళ్యాణ్ రామ్ ఒకరు. 2003 సంవత్సరంలో తొలిచూపులోనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. 2006 సంవత్సరం ఆగష్టు నెల 10వ తేదీన కళ్యాణ్ రామ్ వివాహం స్వాతి తో జరిగింది. స్వాతి వృత్తి రీత్య డాక్టర్. నందమూరి హీరోలు కుటుంబ బంధాలకు చాలా విలువ ఇస్తారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇది మరోసారి రుజువు అయ్యింది.

కళ్యాణ్ రామ్ తన చేతి మీద తన భార్య స్వాతి పేరును పచ్చబొట్టు వేయించుకున్నారు. తన భార్య మీద తనకున్న ప్రేమను చెప్పకనే చెప్పేసాడు. అయితే కళ్యాణ్ రామ్ ఈ పచ్చబొట్టును చాలా సంవత్సరాల క్రితమే వేయించుకున్నాడు. కాకపోతే ప్రస్తుతం సోషల్ మీడియా లో దీనిమీద వార్తలు వస్తున్నాయి. అంతేకాదు కళ్యాణ్ రామ్ కుమారుడు శౌర్య రామ్, కూతురు తారక అద్విత తో పాటు వున్న ఫ్యామిలీ ఫోటోలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంతున్నాయి. ప్రస్థుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Bhargavi

Recent Posts

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

8 minutes ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

22 minutes ago

సంగీత హక్కుల వివాదం: ఇళయరాజాకు కోర్టులో ఎదురుదెబ్బ

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…

2 hours ago

వనస్థలిపురంలో భయంకర ఘటన.. మాజీ భర్త చేతిలో మహిళ దారుణ హత్య

హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…

2 hours ago

గోల్డెన్ అవర్‌లో ఉచిత చికిత్స.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం భారీ భరోసా!

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…

3 hours ago

బంగాళాఖాతంలో లో ప్రెషర్.. ఏపీ, తెలంగాణకు వెదర్ అలర్ట్!

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…

3 hours ago