S. S. Rajamouli : తెలుగులో ఇపుడు నెంబర్ వన్ దర్శకుడు అంటే రాజమౌళి. అయితే ఇక వాళ్ళ సోదరుడు కీరవాణి ఎప్పటినుండో సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. రాజమౌళి తెలుగు సినిమా డైరెక్టర్ గా ఎప్పటినుండో అందరికీ తెలిసినా ఇప్పుడు ఆయన తీసిన సినిమాలు హాలీవుడ్ రేంజ్ కి వెళ్లడంతో ఆయన పేరు ఇండియా మొత్తం మారుమోగిపోతోంది. ఇక రాజమౌళి సినిమాలో తన కుటుంబం మొత్తం ఏదో ఒక విభాగంలో పని చేసి ఉంటారు. రాజమౌళి గారిది ఉమ్మడి కుటుంబం ఇక వాళ్ళు సినిమా తీసినా ఉమ్మడిగా కష్టపడతారు.
రాజమౌళి, కీరవాణి సోదరులైనా పేరు ముందు ఒకటే ఎందుకు లేదు…
అన్నదమ్ముల పిల్లలు అయినా కొంతమందికి ఒకటే ఇంటి పేరు ఉండదు అనుకోవచ్చు. రాజమౌళి వాళ్ళ నాన్న పేరు ముందు కూడా కేవి విజయేంద్ర ప్రసాద్ అని ఉంటుంది. అసలు నిజానికి వాళ్ళ ఇంటి పేరు కోడూరు. ఇక కోడూరి వారి ఇంట పెద్ద సోదరుడు కోడూరి రామా రావు, ఆ తరువాత కీరవాణి వాళ్ళ నాన్న కోడూరు శివశక్తి దత్త, ఆ తరువాత కోడూరి కాశి, ఇక రాజమౌళి నాన్న కోడూరి విజయేంద్ర ప్రసాద్ మరో సోదరుడు. మరి ఎమ్. ఎమ్ కీరవాణి, ఎస్. ఎస్ రాజమౌళి ఎందుకు అన్న అనుమానం మొదలవుతుంది.
ఎమ్. ఎమ్ కీరవాణి పూర్తి పేరు మరకతమని కీరవాణి, ఇక రాజమౌళి పేరు శ్రీశైలం శ్రీ రాజమౌళి. అలా వారి పేర్ల ముందు ఆ అక్షరాలు వచ్చాయి. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రచయిత, ఇక రాజమౌళి, కీరవాణి సంగతి తెలిసిందే. ఇక కీరవాణి సోదరి శ్రీలేఖ కూడా మ్యూజిక్ డైరెక్టర్. ఇక కీరవాణి తమ్ముడు కళ్యాణి మాలిక్ కూడా మ్యూజిక్ డైరెక్టర్, అలాగే బాహుబలి సినిమాకు నేపథ్య సంగీతం అందించారు. ఇక కీరవాణి తండ్రి శివశక్తి దత్త చంద్రహస్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. కీరవాణి గారిని చక్రవర్తి గారి వద్ద సంగీతంలో శిక్షణ కోసం కోడూరి కాశి గారు చేర్పించారట.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…