Nara Lokesh: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో భాగంగా ఈయన మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే తమ విజయం చూపించాలి అన్న దిశగా ఈసారి కూడా ఈయన మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు.
ఇలా మంగళగిరి నుంచి నారా లోకేష్ ఎన్నికల బరిలోకి రాబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పర్యటనలలో పాల్గొనకుండా కేవలం మంగళగిరిలోనే భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. అయితే నారా లోకేష్ ఏదైనా సభలో మాట్లాడితే తప్పకుండా నోరు జారుతారు అంటూ ఒక అభివాదం ఈయనపై వినిపిస్తూనే ఉంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా మంగళగిరి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా మరోసారి నారా లోకేష్ నోరు జారారు. ప్రస్తుతం ఉన్నటువంటి 3000 రూపాయల పెన్షన్ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 చేస్తాము అని చెప్పడం పోయి ప్రస్తుత ఉన్నటువంటి 300 పెన్షన్ 400 చేస్తామంటూ ఈయన కామెంట్లు చేశారు.
పప్పులో కాలేసిన లోకేష్..
ఇలా లోకేష్ తప్పుగా మాట్లాడటంతో అక్కడున్నటువంటి వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అనంతరం పక్కనే ఓ వ్యక్తి కలుగజేసుకొని 3000 నుంచి 4000 చేస్తామని చెప్పగా లోకేష్ అలర్ట్ అయ్యారు.ఇలా మరోసారి ఈయన నోరు జారి తప్పుడు వ్యాఖ్యలు చేయడంతో వైసిపి అభిమానులు సోషల్ మీడియాలో లోకేష్ పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…