Narayana : “దండం పెడుతున్నా వదిలేయండి..” చిరుపై చేసిన అనుచిత వాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నారాయణ..!

Narayana : పొలిటికల్ నాయకులు టంగ్ స్లిప్ అవ్వడం ఆ తరువాత నాలుక కరుచుకోవడం కామనే. అలానే సిపిఐ సీనియర్ నేత నారాయణ. అదికూడా ఒక పొలిటికల్ లీడర్ మీద అయితే పెద్దగా ఏం అవ్వదు, కానీ ఒక మాస్ ఇమేజ్ ఉన్న మెగాస్టార్ లాంటి హీరోని విమర్శిస్తే ఆయన అభిమానులు ఇక ఊరికే ఉంటారా… నారాయణకు మెగా అభిమానులనుండే కాదు అన్ని వైపుల నుండి విమర్శలు రావడంతో ఆయన వెనక్కు తగ్గారు.

క్షమాపణలు చెప్పిన నారాయణ…

అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రులు, అలాగే మెగాస్టార్ చిరు అతిధులుగా హాజరైన విషయం తెలిసిందే. ఇక ఆ వేడుక గురించి మాట్లాడుతూ నారాయణ విమర్శలు గుప్పించారు. అల్లూరి సీతారామరాజుగా నటించిన కృష్ణను పిలవకుండా చిరును పిలవడాన్ని తప్పు పట్టారు. రాజకీయాల్లో రంగులు మార్చే చిరంజీవి స్టేజీపై స్థానం తగదంటూ, చిల్లర బేరగాడు అంటూ తీవ్ర విమర్శలు చేసారు. ఇక ఈ వాఖ్యలతో మెగా ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన కామెంట్స్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.

విజయవాడలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘చిరంజీవి గురించి చేసిన కామెంట్‌ భాషాదోషంగా గమనించాను. దీనివల్ల చిరంజీవి అభిమానులతో పాటు కొందరికి బాధ, ఆవేశం కలిగింది. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు, ప్రతివిమర్శలు ఉంటాయి. అవి లేకుండా రాజకీయ పార్టీలు ఉండవు. దాని ప్రకారం నేను మాట్లాడింది వాస్తవమే. అయితే రాజకీయ భాషకు మించి చిరంజీవి గురించి మాట్లాడినదాన్ని భాషాదోషంగా పరిగణించాలి. మీకు దండం పెడుతున్నా, దాన్ని వదిలిపెట్టండి’ అంటూ క్షమాపణలు చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago