హీరో నానీ ఎమోషనల్ స్పీచ్.. ఎందుకంటే.. ?

తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన నాని అక్కడ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే.. కరోనా మొదటి వేవ్ లో అయినా.. సెకండ్ వేవ్ లో అయినా ముందుగా మూసేసినది థియేటర్లు. కానీ బార్లు, రెస్టారెంట్లు మాత్రం లేట్ గా మూసేశారు. లాక్ డౌన్ సడలింపులో కూడా త్వరగా వాటినే తెరిచారు.

అసలు బార్లు, పబ్బుల కంటే ఎక్కువగా సేఫ్ ఉండేది థియేటర్ లోనే అన్నాడు. తన సినిమాలకు కూడా సైలెంట్‌గానే ఉండే నాని.. తిమ్మరుసు ఈవెంట్‌లో మాత్రం ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. థియేటర్స్ అంటే ఎందుకు పెద్దలకు అంత చిన్న చూపో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రతీ చిన్ని విషయానికి ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లే సినిమా పెద్దలు ఈ విషయంపై ఎందుకు చర్చించడం లేదంటూ ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది బతుకుతున్నారని.. దీని వల్ల ఎంతో మంది రోడ్డున పడుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. దాంతో పాటు నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగుతున్నాయి.. కానీ సినిమా టికెట్ రేట్లు మాత్రం త‌గ్గించ‌మంటున్నారు. దీనికి గల కారణం ఏంటో తెలియడం లేదన్నారు.

తన ‘ట‌క్ జ‌గ‌దీష్’ విడుదలకు ఉందని ఇదంతా చెప్పడం లేదు.. కచ్చితంగా బార్లు, రెస్టారెంట్‌లతో పోలిస్తే థియేటర్స్ సేఫ్ అంటూ కుండ బద్దలు కొట్టి చెప్పాడు. దీనిపై చర్చించిన కొందరు నానీ అడిగిన దాంట్లో న్యాయం ఉందంటూ దీనిపై పెద్దలు ఆలోచించాలని వారు కోరారు.