Shiva Jyothi: న్యూస్ రీడర్ అయ్యుండి లివర్, కిడ్నీకి తేడా తెలియదా జ్యోతక్క.. అసలేం జరిగిందంటే?
Shiva Jyothi: శివ జ్యోతి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు న్యూస్ రీడర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు పొందారు.ఇక బిగ్ బాస్ అనంతరం ఈమె పలు టీవీ కార్యక్రమాలకు హాజరు అవడమే కాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా రోజు రోజుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈమె యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా నల్లి బొక్కల దావత్ వీడియోని పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా భారీగా నెటిజన్లకు ట్రోలింగ్ కి గురవుతుంది. నెల రోజుల క్రితం రంజాన్ పండుగ సందర్భంగా ఈ వీడియోలో శివజ్యోతి పిస్తా హౌస్ రెస్టారెంట్ ప్రకటించిన అన్‌లిమిటెడ్ బఫెట్ గురించి చెప్పింది.
ఈ క్రమంలోనే రెస్టారెంట్ లో ఉన్న వంటకాల గురించి ఈమె వివరిస్తూ అక్కడ ఉన్న మటన్ లివర్ ను ఉద్దేశిస్తూ కిడ్నీ అంటూ కిడ్నీ అంటే చాలా గలీజ్ గా ఉంటుందని మటన్ లివర్ అని చెబుతోంది. పక్కనే ఉన్న తన భర్త లివర్ వేరు, కిడ్నీ వేరు అని చెబుతాడు.
ఈ వీడియోలో ఇది గమనించిన నెటిజన్లు పెద్దఎత్తున ఈమెపై కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. ఒక న్యూస్ రీడర్ అయ్యుండి కిడ్నీకి, లివర్ కి తేడా తెలియకుండా ఉండటం ఏంటి జ్యోతక్క.. ఈ మాత్రం పరిజ్ఞానం కూడా లేదా అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు శివ జ్యోతిని ఓ ఆట ఆడుకుంటున్నారు. మొత్తానికి ఈ వీడియో ద్వారా శివజ్యోతి భారీగా ట్రోలింగ్ కి గురవుతుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…