Yadamma Raju: బుల్లితెరపై కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాదమ్మ రాజు గురించి అందరికీ సుపరిచితమే.యాదమ్మ రాజు గత కొన్ని సంవత్సరాలుగా స్టెల్లా అనే యువతితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.ఇలా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి యాదమ్మ రాజు ఎట్టకేలకు తాను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు.
యాదమ్మ రాజు నిశ్చితార్థం చేసుకోగా ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది జబర్దస్త్ కమెడియన్స్ యాదమ్మ రాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే పలువురు నెటిజన్ల నుంచి వీరికి శుభాకాంక్షలు అందుతుండగా మరికొందరు మాత్రం భారీగా ట్రోల్ చేస్తున్నారు.
యాదమ్మ రాజు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే నేటిజన్ లు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు. అనే విషయానికి వస్తే..వీరి నిశ్చితార్టానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా నేటిజన్ లు వీరిపై మండిపడుతున్నారు.ఈ ఫోటోలలో యాదమ్మ రాజు లేదా స్టెల్లా ఎక్కడా కూడా నుదుటిపై కాస్త బొట్టు కూడా పెట్టుకోకపోవడంతో మండిపడుతున్నారు.
Yadamma Raju: క్రిస్టియన్ యువతని పెళ్లి చేసుకోవడమే తప్పా..
ఇలా ఒక హిందూ వ్యక్తి క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అయితే యాదమ్మ రాజు హిందూ అయినప్పటికీ తాను హిందూ సాంప్రదాయాలను పక్కనపెట్టి అమ్మాయి కోసం మతం కూడా మారావా అంటూ భారీగా ట్రోల్ చేస్తున్నారు. అసలు నీకు సిగ్గు లేదా అంటూ మరికొందరు కూడా కామెంట్లు చేయడంతో కొందరు ఈ కామెంట్లను తిప్పి కొడుతున్నారు. చేసుకునే వారికి వీరి కుటుంబ సభ్యులకు లేని అభ్యంతరం మీకెందుకు అంటూ మరి కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మొత్తానికి యాదమ్మ రాజు తన నిశ్చితార్థ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో భారీగా ట్రోలింగ్ కి గురవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…