మళయాళ ముద్దు గుమ్మ నిత్యామీనన్ గురించి తెలుగు ప్రైక్షకులకు పెద్దగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో, వ్యక్తిత్వంతో చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది. మనకు తెలిసి ఉన్న కొద్దిమంది మంచి నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. మంచి పాత్ర పడాలే కానీ.. తనకు తిరుగు ఉండదు.
ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్న నిత్యామీనన్ ప్రస్తుతం తెలుగులో సరైన హిట్ పడలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ కు జోడిగా భీమ్లానాయక్ లో నటిస్తోంది.. మరోవైపు సత్యదేశ్ హీరోగా నటించిన స్కైలాబ్ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి మార్కలు కొట్టేసింది. అలాంటి నిత్యామీనన్ గతంలో ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యల గురించి బాధపడింది.
ఓ ఇంటర్య్వూలో ప్రభాస్ గురించి ఏమనుకుంటున్నారని ఓ రిపోర్టర్ అడగగా.. నాకు ప్రభాస్ తెలియదంటూ సమాధానం ఇచ్చింది. దీనిపై అప్పట్లో పెద్దగా రచ్చ నడిచింది. నిత్యామీనన్ పొగరుతో మాట్లాడుతుందని చాలా మంది విమర్శించారు. అయితే అప్పటి పరిస్థితులను గురించి నిత్యామీనన్ వివరించింది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు తెలుగు రాదు… కనీసం తెలుగు సినిమాలు కూడా చూడలేదని.. వెంటనే ప్రభాస్ గురించి అడిగితే తెలియదని సమాధానం ఇచ్చానిని చెప్పుకొచ్చింది.
దీనిని పెద్దగా చేసి రిపోర్టర్లు రాయడం.. తన అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవడంపై స్పందించింది. కొన్నిచోట్ల ఎక్కడ నిజాయితీగా ఉండాలో.. ఉండకూడదో అర్థమైందని ఆమె చెప్పుకొచ్చింది. ప్రభాస్ ఇష్యూ నన్ను ఇప్పటికీ బాధపెడుతుందని ఈ మళయాళీ ముద్దు గుమ్మ అంటోంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…