తెలుగు బుల్లితెర కార్యక్రమాల్లో ’ఢీ‘ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈటీవీలో వస్తున్న టీఆర్ఫీ రేటింగ్ కూడా బాగుంటాయి. డ్యాన్స్ ప్రోగ్రాంలలో దీనికి తగిన పోటీ వేరే తెలుగు చానెళ్లలో లేవనే చెప్పవచ్చు. ఇటీవలే 13 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని.. 14 సీజన్ జరిపేందుకు సిద్ధమవుతోంది.
రీసెంట్ గా ఢీ-13 ఫైనల్స్ కు ప్రత్యేక అతిథిగా అల్లు అర్జున్ వచ్చి కావ్యశ్రీకి ట్రోఫిని కూడా అందించారు. డిసెంబర్ 15 నుంచి ఢీ -14 ప్రారంభించనున్నట్లు ప్రోమోను కూడా విడుదల చేశారు. అయితే ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ప్రోమోలో టీమ్ లీడర్లుగా హైపర్ ఆది తో పాటు బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ కనిపించారు.
మరోవైపు జడ్జిలుగా గణేష్ మాస్టర్, ప్రియమణి ఉన్నారు. దీంతో అభిమానుల మదిలో సందేహాలు వచ్చాయి. గత సీజన్ సక్సెస్ కావడానికి కారణమైన సుడిగాలి సుధీర్, రష్మీ, దీపికా పిల్లి తోపాటు మరో జడ్జి పూర్ణ కనిపించలేదు. అది చూసిన తర్వా త అభిమానులు షాక్ అవుతున్నారు. సుధీర్ లేని ఢీ షోను ఇప్పుడు మేం చూడాలా అంటూ కామెంట్ చేస్తున్నారు.
గత సీజన్ హిట్ కావడానికి రష్మీ, సుధీర్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ చాలా హెల్ప్ అయింది. వీరు కనిపించకపోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. సుధీర్ కు బదులు అఖిల్ సార్థక్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అఖిల్ సార్థక్ స్పందిస్తూ.. తీన్మార్ డ్యాన్సర్ ను అలాంటి తనను ఆ షోకు సెలక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. రష్మీ స్థానంలో మోనాల్ రానుందని అంటున్నారు. ఇదే నిజమైతే ఢీ-14లో బిగ్ బాస్ కెమిస్ట్రీ పండుతుందని అభిమానులు అనుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…