పాన్ ఇండియా సినిమాగా రూపొందిన పుష్ప కోసం ప్యాన్స్ ఈగర్ గా వేయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు రష్మికా మందన్నా.. విలన్ గా ఫహాద్ ఫాజిల్ వంటి నటులు కూడా ఉండటంతో అంచనాలు పీక్స్ కు వెళ్లాయి.
తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ చేసిందని చెప్పవచ్చు.
అయితే ఇందులో ముఖ్యమైన పాత్రలో, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తున్న సునీల్ యాక్టింగ్ తో ఇరగదీశాడని తెలుస్తోంది. స్వయంగా బన్నీనే సునీల్ యాక్టింగ్ కు ఫిదా అయ్యాడట.
ఇటీవల డబ్బింగ్ చెప్పడానికి వెళ్లిన బన్నీ.. సునీల్ డబ్బింగ్ చెప్పిన సన్నివేశాలు చూసి ఒకింత షాక్ కి గురయ్యాడట.. ఏమిటీ ఈ యాక్టింగ్ అంటూ సునీల్ గురించి డైరెక్టర్ సుకుమార్ దగ్గర ప్రస్తావించాడు అల్లు అర్జున్. కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ ప్రస్తుతం విలక్షణ పాత్రల్లో కనిపిస్తున్నాడు. కలర్ ఫోటో, పుష్ఫక విమానం సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించాడు.
కలర్ ఫోటో తర్వాత.. పుష్ప సినిమాలో నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు. పుష్ప సినిమాలో సునీల్ గెటప్ చూస్తేనే తెలుస్తోంది. ఈ పాత్ర ఏంత ప్రభావితంగా ఉంటుందో అని.. పైగా బన్నీ కాంప్లిమెంట్స్ కూడా సునీల్ యాక్టింగ్ గురించి తెలుపుతున్నాయి. సినిమా విడుదల తర్వాత సునీల్ క్యారెక్టర్పై మరిన్ని ప్రశంసలు వచ్చే అవకాశం ఉంది. సినిమా ట్రైలర్ లో సునిల్ చెప్పిన ‘కట్టమీట్ట ద కూసుని కూతలు కూసేదాంట్లో ఏముంటది కానీ.. నీళ్ళలోకి దిగితే తెలుసిద్దబ్బా లోతు’ అంటూ చెప్పిన డైలాగ్ అభిమానుల్లో సునీల్ క్యారెక్టర్ పై మరిన్ని అంచనాలను పెంచింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…