Nityananda Statue : నిత్యనంద స్వామి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ గా వుండే నిత్యానంద ఎప్పుడూ ఏదో ఒక వివాదాలతో వార్తల్లో నిలిచేవారు. అయితే నవంబరు 2019లో భారతదేశం వదిలి నిత్యానంద అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. నిత్యానందను దేశంలో విమర్శించే వారితో పాటు పరమ శివుడు రూపం అంటూ దైవ భక్తితో మొక్కే వారు కూడా ఉన్నారు. తాజాగా ఈయనను దేవుడిగా భావించే ఒక భక్తుడు ఏకంగా నిత్యానందస్వామి 18 అడుగుల విగ్రహాన్ని నిర్మించాడు.
ఆలయానికి బాతుమలై మురుగన్ అని నామకరణం…
తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం కి చెందిన బాలసుబ్రమణ్యం అనే భక్తుడు తాను నమ్మిన నిత్యానంద స్వామికి 18 అడుగుల విగ్రహం నిర్మించి తనపై వున్న భక్తిని చాటుకున్నాడు. వారి గ్రామంలోని ఐశ్వర్య నగర్లో ఈ విగ్రహాన్ని స్థాపించి, ఈ ఆలయానికి ‘బాతుమలై మురుగన్’ అని నామకరణం కూడా చేశాడు. మలేసియాలో వున్న మురుగన్ ఆలయం లాగా 27 అడుగుల విగ్రహాన్ని నిర్మించి, ఆ మురుగన్ ఆలయ ప్రారంభంలోనే 18 అడుగుల నిత్యానంద స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కుంభాభిషేకం కూడా జరిపించాడు. ఈ వేడుకకు పుదుచ్చేరి సీఎం రంగస్వామి, ఇతర మంత్రులను కూడా ఆహ్వానించగా కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం హాజరు అవ్వడం జరిగింది.
ఇది ఇలా ఉండగా ఈ వేడుకకు వచ్చిన శివాచార్యులు మాత్రం శివుడి రూపంలో ఉన్న నిత్యానంద విగ్రహాన్ని చూసి ఇది నిత్యానంద విగ్రహం కాదని కాలభైరవుడిని రూపొందించగా సరైన రూపం రాక ఇలా వుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…