ఏపీ లో విశాఖ ఉక్కు ఉద్యమం జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రయివేటీకరణ చేస్తామని, ఇందులో ఏపీ ప్రభుత్వానికి ఈక్విటీ షేర్ లేదని నిర్మల సీతారామన్ తేల్చి చెప్పడంతో విశాఖ లో ఈ ఆందోళనలు ఎక్కువయాయ్యి. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదాలు హోరెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్మికులు ఈ ఆందోళనను ఉధృతం చేశారు. ధర్నాలు, దీక్షలు, మానవహారం, నిరసనలు చేపట్టి వారి సత్తా కేంద్రానికి తెలిసేలా ఆందోళన బాటలు పట్టారు.
ఈ తరుణంలో ఈ ఉద్యమానికి ఆంధ్ర ప్రదేశ్ లోని పలు సంఘాలు, వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీ లు మద్దతు పలుకుతుండగా టాలీవుడ్ లో చలనం లేకపోవడం ఇప్పుడు వివాదం గా మారుతుంది. గతంలో కూడా ఇదే వైఖరి ప్రదర్శించిన టాలీవుడ్ స్టార్ లు ఇప్పుడు అదేవిధంగా పట్టించుకోకపోవడం గమనార్హం.. ఎప్పటిలాగే మనకెందుకు అన్నట్లు వేడుక చూస్తున్నారు. కొంతమంది సెలెబ్రిటీలు మాత్రం ఉద్యమానికి మద్దతు పలుకుతూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టి ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు.
నారా రోహిత్ ఇప్పటికే నిరసన గళం వినిపించారు.ఇంకా రైటర్ కోనా వెంకట్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.కానీ టాలీవుడ్ పెద్దలు మాత్రం ఈ ఇష్యూపై నోరు విప్పలేదు. నారా రోహిత్ కొంచెం గట్టిగానే ట్వీట్ చేశాడు.. కోనవెంకట్, ఆర్ఫీ పట్నాయక్ లు కూడా కొంచెం ఘాటుగానే పోస్ట్ పెట్టి చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. మరి ఈ ఉద్యమానికి టాలీవుడ్ స్టార్ ల హస్తం కూడా తోడయితే విశాఖ ప్రజల హక్కును వారు కాపాడినవారవుతారు. మరి వారిలో చైతన్యం తెచ్చేది ఎవరో..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…