Mudragada: జన సేన నాయకులే నా కూతురితో నన్ను తిట్టించారు.. కూతురు వ్యాఖ్యలపై ముద్రగడ కామెంట్స్!

Mudragada: ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు ఒకసారిగా మార్పు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సిపి పార్టీలోకి వెళ్లిన తర్వాత కొందరు జనసేన నాయకులు తనని టార్గెట్ చేశారు. ముద్రగడ పద్మనాభం గారిని రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా తనని టార్గెట్ చేశారు.ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి కూడా తనకు ఎదురు తిరిగారు.

ఇటీవల ఆమె ఒక వీడియోని షేర్ చేసిన సంగతి తెలిసిందే. మా నాన్నలు కేవలం వైసిపి పవన్ కళ్యాణ్ ని తిట్టడం కోసమే పెట్టుకున్నారని ఎన్నికలు అయిపోయిన తర్వాత మా నాన్నను ఎటు కాకుండా పెట్టేస్తారని ఈమె తెలిపారు. ఈ విషయంలో మా నాన్న తీరు నాకు నచ్చలేదని తాను పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ ఆయన గెలుపు కోసమే కష్టపడతానని క్రాంతి వెల్లడించారు.

ఈ విధంగా తన తండ్రికి వ్యతిరేకంగా క్రాంతి ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో పై ముద్రగడ పద్మనాభం స్పందించారు. తన కుమార్తె క్రాంతి చేత జనసేన నాయకులే నన్ను తిట్టించారని ఈయన తెలియజేశారు. ఇక నా కూతురు ఇప్పుడు నా ప్రాపర్టీ కాదు పెళ్లి కానంత వరకు ఆమె నా ప్రాపర్టీ ఇప్పుడు ఆమె అత్తగారి ప్రాపర్టీ అని తెలిపారు.

అధికారం అనే ఆకలి ..
పవన్ కళ్యాణ్ కేవలం పదవి కోసమే పిఠాపురం వచ్చారని, ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఆయన హైదరాబాద్ కి పరిమితమవుతారని ముద్రగడ తెలిపారు. చంద్రబాబు నాయుడు అధికారం అనే ఆకలి తీర్చుకోవడం కోసమే తాపత్రయపడుతున్నారు అంటూ ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం తన కూతురు కామెంట్లపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago