RGV: సినిమా టికెట్లపైనే కాదు.. అన్నింటిపై నియంత్రణ పెట్టండి..రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు.. !
RGV: ఏపీలో సినిమా టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరుకుంది. టాలీవుడ్ లో ఉన్న ప్రతీ ఒక్కరూ దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. వీళ్ల ఆరోపణలకు ధీటుగా అధికార పార్టీ నాయకులు కూడా సమాధానం ఇస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా ఆర్జీవీ స్పందించాడు. తనదైన శైలిలో అతడు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించాడు.
మొదటి నుంచి కూడా ఆర్జీవీ వైసీపీ సానుభూతిపరుడిగా పేరు ఉంది. టీడీపీ, జనసేన నాయకులపై సెటైరికల్ సినిమాలు తీసే వర్మ.. టికెట్ రేట్ల ఇష్యూలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అతడు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడాడు. నిత్యావరసర సరుకులకు లేని ఫిక్స్ డ్ రేట్లు.. సినిమా టికెట్లకు ఎందుకుని ప్రశ్నించాడు.
టికెట్ రేట్ల వ్యవహారాన్ని ప్రభుత్వం నియంత్రించూకుంటూ పోతే.. ఎవరికి వాళ్లు సొంతంగా సినిమాలు తీసుకుంటూ.. ఓటీటీలు.. యూట్యూబ్ లో రిలీజ్ చేసుకుంటాడరని.. చూడాలనుకున్నోడు చూస్తాడని.. ఇష్టం లేనోడు చూడడు అని అన్నాడు. ఈ ఇష్యూలో ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందంటూ ప్రశ్నించాడు. ఇడ్లీ, బొండా అమ్ముకునే వారి దగ్గరకు వెళ్లి.. నువ్వు ఇదే రేటుకు అమ్మాలి అని హుకుం జారీ చేస్తే.. ఎలా.. రెండో రోజు అతడు ఆ వ్యాపారం చేయలేడు అంటూ చెప్పకొచ్చాడు. బట్టల కొట్టు పెట్టేవాడి దగ్గరకు వెళ్లి.. షర్ట్ అడిగినప్పుడు.. అతడు దానికి వాడిన ముడి సరకును బట్టి… షర్ట్ ఐదొందలు .. ఐదువేలు.. యాభై వేలు చెబితే.. కొనేవాడు కంఫర్ట్‌ని బట్టి దాన్ని కొనుక్కుంటాడు.
కొనుగోలు అమ్మకాలు జరిగినందుకు గవర్నమెంట్‌కి టాక్స్ వస్తుంది కదా.. యాభై వేలు పెట్టి షర్ట్ కొంటుంటే.. మీరు ఐదురూపాయిలకే షర్ట్ అమ్మాలంటూ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం ఏంటో నాకు అర్ధం కావడం లేదు అంటూ లాజికల్ గా మాట్లాడాడు ఆర్జీవీ. ఒక్క సినిమాలపైనే రేట్లు ఎందుకు పెడుతున్నారు.. జనం కొనే అన్నింటిపైనా పెట్టాలి కదా.. ఉప్మా మీద.. ఇడ్లీ మీద.. చీరల మీద అన్నింటి మీద పెట్టాలి. ఒక్క సినిమాలపైనే ఈ ఫిక్స్డ్ రేట్లు ఎందుకు పెడుతున్నారు అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఆర్జీవీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక చివరగా తన సినిమాలకు ఏపీలో కూడా రిలీజ్ చేస్తానని.. నా సినిమాలను ప్రభుత్వం అడ్డుకోదు అంటూ చెప్పుకొచ్చాడు.
ఉమ్మడి కుటుంబాలతో కలిసి ప్రయాణాలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సెలవులు, పండుగలు, ప్రత్యేక సందర్భాలు—ఇలాంటి సమయాల్లో ఒకే వాహనంలో…
కొద్ది రోజుల్లో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ మార్కెట్‌లోకి రాబోతోంది. అంతకు ముందే, S24 స్మార్ట్‌ఫోన్ ధరలో పెద్ద తగ్గింపు…
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…