Featured

NTR : తెలుగులో మొదటి త్రిపాత్రాభినయ చిత్రంలో నటించిన హీరో ఎవరు.?! ఆ రోజుల్లో ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది.!!

నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు.తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు.

ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని “నేషనల్ ఆర్ట్ ప్రొడక్షన్సు” పతాకంపై విడుదల చేసాడు. 1977లో విడుదలైన దాన వీర శూర కర్ణలో అతను మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసాడు. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా అతను దర్శకత్వం వహించాడు. దాన వీర శూర కర్ణ సినిమా నిర్మాణ విషయానికి వస్తే…

1977లో ఎన్టీఆర్, స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో “దానవీరశూరకర్ణ” చిత్రం విడుదల అయ్యింది. ఎన్టీ రామారావు, కొండవీటి వెంకటకవి కలిసి సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం దానవీరశూరకర్ణ చిత్రం. ఎన్టీఆర్ నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలతో పాటు కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి మూడు పాత్రల్లో ఆయన నటించారనేకంటే జీవించాడని చెప్పవచ్చు. సభలో “ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి.. ఇది క్షాత్ర పరిక్షే కాని క్షత్రియ పరిక్ష కాదే.. కాదు,కాకూడదు” అనే సంభాషణను నేటికి ప్రేక్షకులు అనుసరించడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఎన్టీ.రామారావు కృషి, శ్రమ ఫలితంగా చెప్పుకోవచ్చు.

ఎన్టీఆర్ మహాభారతం లోని కొంత భాగాన్ని తీసుకుని ఒక పౌరాణిక చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. ఆ సినిమాకి సంభాషణల రచయితగా గుంటూరులోని ఓ సంస్కృత శకళాశాల ప్రిన్సిపాల్ అయినటువంటి కొండవీటి వెంకట కవిని తీసుకున్నారు. అయితే ఈ కవికి ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. కానీ ఆయన రాసిన సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో ధర్మరాజుగా ప్రభాకర్ రెడ్డి, అర్జునుడిగా హరికృష్ణ, భీముడిగా సత్యనారాయణ, అభిమన్యుడిగా బాలకృష్ణ.. ఇకపోతే ఈ చిత్రంలో మూడు పాత్రల్లో ఎన్.టి.రామారావు కనిపించిన ఈ భారీ చిత్రాన్ని కేవలం నలభై మూడు రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడం జరిగింది.

ఈ సినిమా నిడివి దాదాపు 4 గం.ల17 నిమిషాలు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఏదో ఒక పాత్రలో సుమారుగా నాలుగు గంటలపాటు కనిపిస్తారు. సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు అందించిన సంగీతం సినిమాకి ప్రాణం పోసిందని చెప్పవచ్చు. కొండవీటి వెంకటకవి, డాక్టర్ సి.నారాయణరెడ్డి, దాశరథి వంటి వారు ఈ సినిమాకి గీతాలను అందించారు. ఆ రోజుల్లో ఈ సినిమా ఘన విజయం సాధించింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago