1980వ దశకం ఎన్టీఆర్,అక్కినేని మహానటుల సినిమాలు తగ్గుముఖం పట్టాయి. ఇంకా కృష్ణ, శోభన్ బాబు చిత్రాలు కొనసాగుతున్న సమయంలో మరో కొత్త తరం.. చిరంజీవి, బాలకృష్ణ, సుమన్, రాజశేఖర్, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోల సినీరంగ ప్రవేశం జరిగింది. సీనియర్ హీరోలు గట్టిపోటీ ఇచ్చినప్పటికి తమ నటన, డ్యాన్స్, ఫైట్లతో ఈ కొత్త తరం కుర్రాళ్ళు తమ సత్తా చాటారు. ఆక్రమంలో అప్పటి స్టార్ డైరెక్టర్ లైన దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణల హవా కొనసాగుతుంది.
మొదటగా చిరంజీవి విషయానికి వచ్చినట్లయితే.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అడవిదొంగ, కొండవీటి రాజా, జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి బ్లాక్ బస్టర్ లో ఆయన నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో “లంకేశ్వరుడు” చిత్రంలో హీరోగా చేశారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అభిలాష, దొంగమొగుడు రాక్షసుడు, పసివాడి ప్రాణం లాంటి బ్లాక్ బస్టర్స్ లో నటించారు.
బాలకృష్ణ రాఘవేంద్రరావు దర్శకత్వంలో పట్టాభిషేకం, అపూర్వ సహోదరులు లాంటి చిత్రాలు వచ్చాయి. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అనసూయమ్మ గారి అల్లుడు, భార్గవరాముడు,నారీ నారీ నడుమ మురారి లాంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. అలాగే కోడిరామకృష్ణ దర్శకత్వంలో మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య చిత్రాల్లో నటించారు.
హీరో నాగార్జున దాసరి దర్శకత్వంలో వచ్చిన మజ్ను చిత్రంలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఆఖరిపోరాటం’ చిత్రంలో నటించి హిట్ కొట్టారు. దర్శకేంద్రుడు వెంకటేష్ ను “కలియుగ పాండవులు” చిత్రంతో హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఆ తర్వాత ‘ఒంటరిపోరాటం’ అనే మరో విజయవంతమైన చిత్రాన్ని వెంకటేష్ తో రాఘవేంద్రరావు రూపొందించారు.
1980-1990 మధ్య కాలంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ గ్రాఫ్ అలా ఉండగా.. ఈ 10 సంవత్సరాల మధ్య కాలంలో దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సుమన్ నటించలేదు. అలాగే ఆనాటి స్టార్ హీరోయిన్ లైన శ్రీదేవి, జయప్రద లతో చిందేయలేదు. అందం, అభినయం, కరాటేలో నైపుణ్యం కలిగి ఉన్న సుమన్ తరంగిణి, ఇద్దరు కిలాడీలు, నేటి భారతం, ప్రళయ సింహం, సితార, మెరుపు దాడి, దేశంలో దొంగలు పడ్డారు, ఉక్కు సంకెళ్లు, 20వ శతాబ్దం, ఉగ్రనేత్రుడు, అమెరికా అల్లుడు, పల్నాటి రుద్రయ్య, రావుగారింట్లో రౌడీ.. లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడిలా, ఒంటరిగా విజయదుందుబి మోగించారు.
1990 అనంతరం దాసరి, రాఘవేంద్రరావులు సినిమాలు చేయడం తగ్గించాక దాసరి దర్శకత్వంలో వచ్చిన “మాయాబజార్” అలాగే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన “అన్నమయ్య” చిత్రంలో సుమన్ నటించడం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…